HBD Pawan Kalyan: పవన్‌కి పవర్ స్టార్ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

HBD Pawan Kalyan

దిక్కులు పెక్కటిల్లేలా పవర్ స్టార్… పవర్ స్టార్… పవర్ స్టార్ అంటూ తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రెట్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఈ పవర్ స్టార్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇక మాటల్లో చెప్పలేం. అయితే ఇప్పుడు మనం ఎంతో పవర్ ఉన్న ఈ “పవర్ స్టార్” పేరు గురించి తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ అని చాలా పవర్ ఫుల్ గా పిలుచుకుంటారు. కానీ, ఈ పేరు ఎలా వచ్చిందో? ఎందుకు వచ్చిందో? ఎప్పుడు వచ్చిందో? ఎవరు పెట్టారో? ఫస్ట్ పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో? చాలా మందికి తెలియదు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో మూడో సినిమా సుస్వాగతం. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో ఫస్ట్ టైం పవర్ స్టార్ అనే పేరు వినిపించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద కామెంట్స్ చేస్తున్న పోసాని కృష్ణ మురళి నే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ అని పిలిచాడు. తర్వాత అదే పేరు ఇప్పటి వరకు ఉంది. సుస్వాగతం సినిమా టైటిల్స్ ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వేశారు.

- Advertisement -

కాగా, నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో నుంచి అప్డేట్స్ కూడా వరుస పెట్టి రావడంతో ఫ్యాన్స్‌కు ట్రీట్ మీద ట్రీట్ వచ్చి పడుతున్నాయి. కాసేపటి క్రితం ఓజీ టీజర్ రాగా, ఇప్పటికే హరి హర వీరమల్లు పోస్టర్ వచ్చింది. అలాగే సురేందర్ రెడ్డి మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. త్వరలోనే ఉస్తాడ్ భగత్ సింగ్ నుంచి కూడా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు