OG Teaser: అసలైన బర్త్ డే ట్రీట్… ఇది కదా కావాల్సింది

OG Teaser

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ యాన్టిస్పెటెడ్ సినిమా ఓజి టీజర్ కాసేపటి క్రితం రిలీజయ్యింది. దానయ్య డివివి నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిచబడుతున్న ఈ సినిమాపై ఒక పక్క పవన్ కళ్యాణ్ అభిమానుల్లో. మరో పక్క ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఓజి సినిమాకు సంబంధించి మొదటి టీజర్ ను విడుదల చేసారు మేకర్స్.

హాంగర్ చితా అనే పేరుతో రిలీజైన ఓజి టీజర్ ను బట్టి చూస్తే.. ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ స్టామినాకు సరిపోయేలా సాలిడ్ సినిమా పడినట్టుగా ఉంది. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యం జరిగే రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఓజి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ ను తలపిస్తున్న విజువల్స్ తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దాదాపు 90 సెకన్ల పాటు ఉన్న ఈ సినిమా టీజర్ లో థమన్ మ్యూజిక్ మేజర్ హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మరియు శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్, తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్ గా ఉంటూ థియేటర్స్ లో ఆయన సినిమాలకు ఒక అభిమానిగా రచ్చ చేసిన సుజీత్ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే చేస్తుండటం ఈ సినిమాకు ఏ పబ్లిసిటీ చేయకుండానే భారీ పాపులారిటీ తీసుకొచ్చి పెట్టింది. 2019 లో ప్రభాస్ తో సాహూ సినిమా తీసిన సుజీత్, లాంగ్ గ్యాప్ తరువాత ఓజి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక ఈ టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత ఇది కదా పవన్ నుంచి తమకు కావాల్సింది అంటూ కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు