Hari Hara Veera Mallu: సంవత్సరం నుంచి ఏం చేయలేదా? కొత్త పోస్టర్‌పై కొత్త ప్రశ్నలు

Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ కటౌట్ ఒక మంచి సినిమా పడితే, ఇండియన్ సినిమా హిస్టరీస్ మారిపోతాయి. ఇది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్న మాట. కానీ, అలాంటి స్టోరీ రాలేదు. ముఖ్యంగా పవర్ స్టార్‌ నుంచి ఒక పిరియాడికల్ డ్రామా మూవీ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అని అనుకున్నారు. అందరి కలలను నిజం చేస్తూ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పవన్ తో హరి హర వీరమల్లు అనే ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు.

ఇది అనౌన్స్ చేేసినప్పుటి నుంచి పవన్ ను ఫ్యాన్స్ తమ డ్రీమ్ రోల్‌లో చూడబోతున్నామని తెగ సంతోషపడ్డారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఏళ్లు గుడుస్తున్న సినిమా రిలీజ్‌కి నోచుకోవడం లేదు. 2019లో ఈ మూవీ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇది 2023 ఈ ఏడాది కూడా రిలీజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి.

ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా రద్దు అయిందనే వార్తలు కూడా వచ్చాయి. దీని తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అవుతున్నాయి. బ్రో సినిమా అయితే ఏకంగా రిలీజ్ కూడా అయిపోయింది. దీంతో హరి హర వీరమల్లు చిత్రాన్ని అటకెక్కించారని అనుకున్నారు. తాజాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి, తమ సినిమా ఇంకా బతికే ఉందని చెప్పారు.

- Advertisement -

అయితే ఈ పోస్టర్ లో ఉన్న స్టిల్ ఎక్కడో చూసినట్టు ఉందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంకెక్కడా.. గతేడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవర్ గ్లాన్స్ అనే పేరుతో ఒక టీజర్ రిలీజ్ అందులోని ఒక స్టిల్ నే ఈ రోజు పోస్టర్ గా రిలీజ్ చేశారు. అంటే గత ఒక సంవత్సరం నుంచి హరి హర వీరమల్లు షూటింగ్ జరగలేదా? అని ఫ్యాన్స్ అంటున్నారు.

షూటింగ్ జరిగితే కొత్త స్టిల్ రిలీజ్ చేయాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. గత మూడు, నాలుగేళ్ల నుంచి హరి హర వీరమల్లు కోసం వేసిన సెట్స్ ఇంకా ఉన్నాయా? అందులో ఇంకా షూటింగ్ చేయోచ్చా? అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణ్ బర్త్ డేకి ట్రీట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ రత్నంకు క్రుతజ్ఞతలు బదులు ప్రశ్నలు వస్తున్నాయి.ఇప్పటికైనా షూటింగ్ పై, తర్వాత షెడ్యూల్ పై, రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు