Pawan Kalyan’s OG: బ్రో ఎఫెక్ట్ తో రియలైజ్ అయిన పవన్…!

Pawan Kalyan’s OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదన్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కేవలం 20రోజుల డేట్స్ మాత్రమే కేటాయించటం, బడ్జెట్లో సింహభాగం పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గా తీసుకోవటంతో సినిమాను హడావిడిగా చుట్టేశారు.

ఈ ఎఫెక్ట్ సినిమాలో కొట్టొచ్చినట్లు కనపడింది. వీఎఫెక్స్ లో క్వాలిటీ లేకపోవటం ఒక్క సాంగ్ కూడా చార్ట్ బస్టర్ కాకపోవటంతో సినిమా అభిమానులను సైతం అలరించ లేకపోయింది. పవన్ కళ్యాణ్ వింటేజ్ ఎపిసోడ్స్ గనక లేకపోయి ఉంటే సినిమా డిజాస్టర్ అయ్యుండేదని చెప్పాలి.

బ్రో సినిమా రిజల్ట్ తో పునరాలోచనలో పడ్డ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా స్క్రిప్ట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట అన్ని సినిమాల్లాగానే ఈ సినిమాకు కూడా తక్కువ డేట్స్ కేటాయించిన పవన్ ఇప్పుడు ఓజి సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. స్రిప్ట్ విషయంలో చాలా మార్పులు కూడా సజెస్ట్ చేయటమే కాకుండా ఎక్కువ డేట్స్ కూడా కేటాయించాడని టాక్ వినిపిస్తోంది. దీంతో మొదట పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి తక్కువ లెంత్ లో ప్లాన్ చేసిన డైరెక్టర్ సుజిత్ స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేస్తున్నాడని అంటున్నారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లెంత్ పెరిగిన నేపథ్యంలో సినిమాలో మరిన్ని యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తున్నారట. త్వరలోనే థాయిలాండ్ లో 30రోజుల షెడ్యూల్ స్టార్ట్ చేసి యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేయాలని డిసైడ్ అయ్యిందట సినిమా యూనిట్. మొత్తానికి బ్రో సినిమా పుణ్యమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజి రూపంలో బ్లాక్ బస్టర్ లోడ్ అవుతుందని చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు