Allu Arjun’s Pushpa2: పుష్ప2 ఇంకా డిలే అవుతుందా..?

Allu Arjun’s Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు రావటంతో టాలీవుడ్ సర్కిల్స్ లో పండగ వాతావరణం నెలకొంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కి ఈ అవార్డు రావటం ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది. ఈ అవార్డుతో 69ఏళ్ళ నేషనల్ అవార్డ్స్ హిస్టరీలో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఇదిలా ఉండగా నేషనల్ అవార్డు ఎఫెక్ట్ తో పుష్ప2 సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అసలే షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతున్నప్పటికీ సినిమా గ్లిమ్ప్స్ మినహా ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఈ కొత్త టెన్షన్ మొదలైంది.

పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అయిన నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ పార్ట్2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, అందుకే పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదని టాక్ వినిపిస్తోంది, అయితే, ఇప్పుడు పుష్ప సినిమాకి బెస్ట్ హీరో అవార్డుతో పాటు బెస్ట్ మ్యూజిక్ కి కూడా అవార్డు వచ్చిన నేపథ్యంలో సుకుమార్ సినిమాలో పర్ఫెక్షన్ కోసం మరింత టైమ్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల షూటింగ్ డిలే అవుతూ వస్తున్న నేపథ్యంలో 2024 మార్చ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. నేషనల్ అవార్డు వచ్చిన జోష్ లో సుకుమార్ గనక స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేయాలనీ డిసైడ్ అయితే 2024 మార్చ్ లో కూడా సినిమా రిలీజ్ అవ్వటం కష్టమే అని చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు