Miss Shetty Mister Polishetty: ఇక రీల్ లో తప్ప రియల్ గా కనపడవా స్వీటీ..!

Miss Shetty Mister Polishetty

స్వీటీ అనుష్క ఏ క్షణాన సైజ్ జీరో సినిమా చేసిందో కానీ, అప్పటి నుండి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టుంది. ఆ సినిమా కోసం వెయిట్ పెరిగిన స్వీటీ, బరువు తగ్గటం కోసం నానా తిప్పలు పడుతున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. పెరిగిన బరువు కారణంగా బయట కనిపించటం దాదాపు పూర్తిగా మానేసింది పాపం అనుష్క.

సైజ్ జీరో సినిమా తర్వాత అనుష్క నటించిన సినిమా బాహుబలిలో కూడా అనుష్క లుక్స్ ని వీఎఫెక్స్ తో మేనేజ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన భాగమతి సినిమాలో అనుష్క ఫిజిక్ లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. నిశ్శబ్దం సినిమా సమయంలోను సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో కూడా అనుష్క ఫిజిక్ ని వీఎఫెక్స్ తో మేనేజ్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. అనుష్క ఫేస్ ఒక్కో షాట్ లో ఒక్కోలా కనిపిస్తూ చాలా అసహజంగా ఉందన్న ఫీల్ వచ్చింది. బరువు తగ్గకపోవడం వల్లనే అనుష్క బయట కనిపించటం మానేసిందని, అందుకే మిస్ శెట్టి సినిమా ప్రమోషన్స్ లో కూడా కనిపించటం లేదని టాక్ వినిపిస్తోంది. అనుష్క రాకపోవటం వల్ల హీరో నవీన్ పోలిశెట్టి ఒక్కడే ప్రమోషన్స్ భారం భుజాన వేసుకొని నడిపిస్తున్నాడు.

- Advertisement -

ఈ క్రమంలో అనుష్క ఫ్యాన్స్ ఇక తమ స్వీటీని స్క్రీన్ మీద తప్ప బయట చూడలేమా అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రమోషన్స్ కి రాకపోయినా కనీసం ప్రీరిలీజ్ ఈవెంట్ కి అయినా అనుష్క వస్తుందేమో అన్న హోప్ తో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరి, అనుష్క దర్శనం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ లోనో, అదీ కుదరకపోతే సినిమా సక్సెస్ మీట్ లో అయినా స్వీటీ దర్శనభాగ్యం కలుగుతుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు