#RC16 – Story: చరణ్ బుచ్చిబాబు స్టోరీ లీక్ – గూస్ బంప్స్ గ్యారంటీ..!

#RC16 – Story

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా తర్వాత స్టార్ట్ అవ్వనున్న ఈ సినిమా గురించి తరచూ ఎదో ఒక వార్త వినిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కనిపించబోయే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించనున్నాడనే వార్త సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేయగా ప్రస్తుతం సినిమా కథ గురించి వినిపిస్తున్న న్యూస్ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లే విధంగా ఉంది. ఈ సినిమా కబడ్డీ బ్యాక్డ్రాప్ లో రూపొందనుందని వచ్చిన వార్తలకు భిన్నంగా ఉంది ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్.

ఈ సినిమా కండల వీరుడు, కలియుగ భీముడు, మల్ల యోధుడు, ఐడియాన్ హెర్క్యులస్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోడి రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. బ్రహ్మచారి అయిన కోడి రామ్మూర్తి నాయుడు జీవితంలోని విశేషాల గురించి తెలిసిన వారికి ఈ న్యూస్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

- Advertisement -

వృత్తి రీత్యా మల్ల యోధుడైన రామ్మూర్తి కండలు తిరిగిన బాడీ కలిగి ఉండేవాడని, యోగ విద్యలో కూడా ప్రావిణ్యం కలిగి ఉండేవాడట. మల్లయుద్ధంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాక రామ్మూర్తి ఒక సర్కస్ కంపెనీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడట.

రామ్మూర్తి ఛాతి మీద టన్నున్నర కి పైగా బరువును అలవోకగా 5నిమిషాలకంటే ఎక్కువ సేపు మోయగలిగే వాడట. రెండు కార్లను బలమైన గొలుసులతో తన చేతులకు కట్టగా అవి ఎంత స్పీడ్ రైజ్ చేసినా కూడా కదలకుండా ఆపగలిగే వాడని, ఇలా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి సీక్వెన్స్ లు గనక సినిమాలో ఉంటే రికార్డులు బద్దలవ్వటం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి, షూటింగ్ స్టార్ట్ కాకముందే హైప్ పెంచుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు