Ram Charan’s RC16: విజయ్ సేతుపతి ఫుల్ బిజీ – పట్టు వదలని బుచ్చి బాబు..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఓ సినిమా లైనప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా పూర్తయ్యాక షూటింగ్ స్టార్ట్ చేయటానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు బుచ్చిబాబు. మొదట ఈ విలన్ రోల్ కోసం ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్నప్పటికీ మళ్లీ విజయ్ సేతుపతి మీదనే ఫోకస్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కంటే విలన్ రోల్ చాలా పవర్ఫుల్ ఉంటుందని, ఈ క్యారెక్టర్ విజయ్ సేతుపతి అయితేనే న్యాయం చేయగలదని బుచ్చిబాబు ఫిక్స్ అయ్యాడట.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సేతుపతి డేట్స్ కుదరాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉందని టాక్ వినిపిస్తోంది. ముందుగా కమిట్ అయిన సినిమాలను కాదని ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా కూడా టెంప్ట్ అవ్వకూడదని విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. అయినప్పటికీ బుచ్చిబాబు మాత్రం విజయ్ సేతుపతి డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.

షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ సినిమా స్టోరీ గురించి, రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి వినిపిస్తున్న న్యూస్ సినిమాపై అంచనాలు పెంచుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ సేతుపతి ఇందులో విలన్ రోల్ లో కనిపించనున్నడంటూ వస్తున్న న్యూస్ ఆ అంచనాలు మరింత పెంచుతోంది. మరి, ఉప్పెన సినిమా ద్వారా మొదటి ప్రయత్నంలోనే 100కోట్ల క్లబ్ లో చేరిన బుచ్చిబాబు ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు