Anikha surendran: చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా? మరి సక్సెస్?

Anikha surendran:

అనికా సురేంద్రన్.. ఈ పేరు వింటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు గాని, ఎంత వాడుగాని సినిమాలో హీరో కూతురు అంటే యిట్టె గుర్తు పడతారు. కేరళకి చెందిన ఈ ముద్దుగుమ్మ మలయాళం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత తమిళ్ లోను పలు పెద్ద సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలు చేసింది. చూడ్డానికి ఎంతో క్యూట్ గా ఉండే ఈ అమ్మాయి ఈ ఇయర్ బుట్టబొమ్మ అనే తెలుగు సినిమాతో హిరోయిన్ గా మారింది.

మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ సడన్ గా హీరోయిన్ అయితే పట్టించుకోరనుకుందో ఏమో తెలుగులోనే డైరెక్ట్ గా హీరోయిన్ అయింది. బుట్టబొమ్మ సినిమాలో విలక్షణ నటుడు అర్జున్ దాస్ హీరోగా నటించాడు. సినిమాకి టాక్ బాగా వచినప్ప్పటికీ ప్రమోషన్ల లోపం వల్ల అంతగా ఆడలేదు. అయితే హీరోయిన్ గా మాత్రం అనికా చక్కగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. అయితే అప్పుడే హీరోయిన్ గా ఆఫర్లు రాకపోయినా, సెకండ్ లీడ్ రోల్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏవి ఇచ్చినా కూడా చేస్తూ వస్తుంది.

అలా తెలుగులో నాగార్జున ఘోస్ట్ సినిమాలో కూడా నటించగా, ఈ ఇయర్ కింగ్ అఫ్ కొత్త లో మరో రోల్ లో నటించింది. అయితే హీరోయిన్ గా మాత్రం అనికా కి సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది అనికా సురేంద్రన్. మరి ఈ సినిమాలతో హీరోయిన్ గా సక్సెస్ కొట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాదు, హీరోయిన్ గా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని నిరూపించుకొనే ప్రయత్నంలో ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు