Buttabomma: “బుట్టబొమ్మ” కోసం టిల్లు!

టాలీవుడ్ లో ప్రస్తుతం “బుట్టబొమ్మ” మూవీ ట్రెండింగ్ గా మారింది. అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్టలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “బుట్టబొమ్మ”. మలయాళ సినిమా ‘కప్పేలా’ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీమతి సాయి సౌజన్య నిర్మించిన “బుట్టబొమ్మ” సినిమా జనవరి 26న విడుదల కావాల్సింది.

కానీ వారం రోజులపాటు వాయిదా వేసి ఫిబ్రవరి 4నబుట్ట బొమ్మ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్ ని పీక్ స్టేజ్ ని తీసుకొని వెళ్తూ మేకర్స్ “బుట్టబొమ్మ” ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒరిజినల్ వర్షన్ లో ఉన్న ఫీల్ ని అలానే మెయింటైన్ చేస్తూ రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కూడా అదే ఫీల్ ని క్యారీ చేసింది. ఇందులో లీడ్ పెయిర్ మధ్య ఎమోషన్ వర్క్ అవుట్ అయ్యింది.

అయితే తాజాగా బుట్ట బొమ్మ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు అయింది. ఫిబ్రవరి రెండవ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో పార్క్ హయాత్ హోటల్ లో బుట్ట బొమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ ముఖ్యఅతిథిగా వస్తున్నాడు. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అలాగే ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది బుట్ట బొమ్మ చిత్ర బృందం.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు