Boys Hostel Trailer: కాంతార లాంటి మరో హిట్ లోడింగ్..!

Boys Hostel Trailer

కేజిఎఫ్ తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ మార్కెట్ రేంజ్ పెరిగిన సంగతి తెలిసిందే. కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మరో కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతోంది. ఇటీవలే కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరేని’ అనే సినిమాను బాయ్స్ హాస్టల్ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ సినిమాస్ కలిసి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. యూత్ ఫుల్ కంటెంట్ కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఒక పెద్ద బాయ్స్ హాస్టల్ చుట్టూ రూపొందిన ఈ సినిమా ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. బుల్లితెర యాంకర్ రష్మీ గ్లామర్ షో ట్రైలర్ కి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ఆగస్టు 25న పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మీద నమ్మకంతో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాను ఇప్పటికే చుసినవారు తెలుగులో తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో ఇటీవలే వచ్చిన బేబీ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కన్నడ సినిమా ఇండస్ట్రీకి మరో కాంతార లాంటి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు