Allu Arjun’s Pushpa2: పుష్ప2 గురించి మైండ్ బ్లోయింగ్ న్యూస్..!

Allu Arjun’s Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పార్ట్2 షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతున్నప్పటికీ, ఆ మధ్య రిలీజైన గ్లిమ్ప్స్ మినహా సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. అయితే, తరచూ పార్ట్2 గురించి ఎదో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా పుష్ప 3కూడా రానుందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుష్ప 2సినిమా ఎండింగ్ లో పార్ట్ 3 గురించి రివీల్ చేస్తారని సమాచారం. అయితే, అల్లు అర్జున్ ప్రస్తుతం సందీప్ రెడీ వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు కమిట్ అయ్యాడు కాబట్టి పుష్ప 3 2025లో మొదలయ్యే అవకాశం ఉంది.
కెజిఎఫ్ సినిమా తరహాలోనే పుష్ప సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కెజిఎఫ్ సినిమా కూడా పార్ట్2 తో ముగుస్తుందని మొదట భావించారు. కెజిఎఫ్ పార్ట్2 క్లైమాక్స్ లో థర్డ్ పార్ట్ కి లీడ్ ఇవ్వటంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు పుష్ప2 లో కూడా థర్డ్ పార్ట్ స్టోరీకి సంబంధించిన లీడ్ ఇస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజం అయితే, పుష్ప మరో క్రేజీ ఫ్రాంచైజ్ గా నిలిచే అవకాశం ఉంది.
పుష్ప 2గురించి రెగ్యులర్ గా వస్తున్న వార్తలు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పార్ట్ 1 మొదట్లో డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ తర్వాత మెల్లిగా పుంజుకొని హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించింది. ఈ నేపథ్యంలో లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప2 ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తాడో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు