Kushi movie: విజయ్ దేవరకొండ, సమంతల లిప్ లాక్ లపై రష్మిక రియాక్షన్ ?

Kushi movie

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి ప్రేక్షకుల దగ్గర నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్స్ లో అలరిస్తుంది.

అలాగే ఖుషి సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ ల లిప్ లాక్ సన్నివేశాలు కూడా కాస్త వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఖుషి సినిమా కథ ముఖ్యంగా ప్రేమ పెళ్లి గురించి ఎక్కువగా ఉండటం వల్ల.. ముద్దు సీన్స్ ఉండటం సర్వసాధారణం అని మేకర్స్ క్లారిటీ ఇస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దు సీన్స్.. స్క్రీన్ షాట్స్ రూపంలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ముద్దుల వ్యవహారంపై అందరి రియాక్షన్ ఎలా ఉన్న కానీ హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం ఎలా రియాక్ట్ అవుతుందనడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమికుల.. ? లేక పెళ్లి చేసుకోబోయే జంటనా అనే విషయం పక్కన పెడితే వాళ్లిద్దరూ మంచి స్నేహితులు అనే విషయాన్ని మాత్రం ఎవరు కాదనలేరు . గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి పలు చిత్రాలలో నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అనతి కాలంలోనే మంచి స్నేహితులు అయ్యారు.

- Advertisement -

ఇక ఆ తరువాత నుంచి వీరిద్దరూ ఒకరి సినిమాకు ఒకరు విష్ చేసుకోవడం, ఆయా సినిమాలు సక్సెస్ అయితే సెలెబ్రేట్ చేసుకోవడం చాలా కామన్ అయింది. అయితే ఇది కొద్దీ రోజుల వరకు బాగానే సాగింది. కానీ ఇటీవల కాలంలో మాత్రం మరీ ఈ జంటకు ఏమైందో గాని, ఇద్దరు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత లిప్ లాక్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు రష్మిక.. ఖుషి సినిమాపై ఏ విధంగానూ రియాక్ట్ అవకపోవడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవలనే ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాను దగ్గర ఉండి, ప్రమోట్ చేసిన రష్మిక.. ఖుషి సినిమా గురించి నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు