Prabhas Marriage: రిచ్ ఫ్యామిలీ ఇంటికి అల్లుడు కాబోతున్న ప్రభాస్ ?

Prabhas Marriage

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఇండియాలోని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ఖాన్స్ తో సమానంగా ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాలకు వాళ్లకంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

అలా ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ మూడు సినిమాలకు గాను ఆయన రెమ్యూనరేషన్ 300 కోట్ల రూపాయల పైమాటే. అలా వచ్చిన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని ఇటలీలో కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాడట. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దివంగత నటుడు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు భార్య ఇటీవల ఒక మంచి సంబంధం చూసిందట.

ఓ గొప్పింటి అమ్మాయిని ప్రభాస్ కి ఇచ్చి పెళ్లి చేయాలనే భావిస్తున్నారట. ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో ఉంటుందట. బిజినెస్ కి చెందిన పెద్ద కోర్సు చేస్తుంది అని తెలుస్తోంది. ఆమె చదువు చివరికి రావడంతో ప్రభాస్ కూడా… ఆ అమ్మాయి ఫోటో చూసి పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు… దాదాపు ఈ సంబంధం ఖాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని దక్కించుకోలేకపోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు