Bigboss season 7 update: బిగ్ బాస్ 7 లోకి టాలీవుడ్ హీరో శివాజీ ?

Bigboss season 7 update

ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవాడు హీరో శివాజీ. ఆ తర్వాత ఆయన ఉన్నట్లుండి సినిమాల నుంచి దూరమయ్యారు. కొన్నాళ్లపాటు రాజకీయాల్లో కూడా కనిపించారు. గరుడ పురాణంతో కొన్ని రోజులపాటు వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కూడా ఆడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో ఆయన అసలు కనిపించడమే మానేశారు.

ఇంకా బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కానేలేదు. అప్పుడే తోలి వారంలో ఎవరిని బయటకు పంపాలనే దానిపై చర్చలు మొదలైపోయాయి. దాదాపు 21 మంది కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తుండడంతో వారిలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అన్నది చివరి వరకు సస్పెన్సే. ఈసారి కాంట్రవర్సీలతో సంబంధం ఉన్న కంటెస్టెంట్స్ ను తీసుకున్నారని టాక్ వినిపిస్తుండగా తాజాగా హీరో శివాజీ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు టాక్.

ఆడియన్స్ లో పాపులారిటీ ఉన్న సెలెబ్రేటీలని సీజన్ 7 కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. హీరో శివాజీ కూడా బిగ్ బాస్ సెవెన్ లోకి ఎంట్రీ ఇస్తే మరిన్ని కాంట్రవర్సీలు, గొడవలు కాయం. హీరో శివాజీ చాలా రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఈయన గతంలో చేసిన పొలిటికల్ కామెంట్స్ కాంట్రవర్షియల్ అయ్యి ఈయన పాపులర్ అయ్యాడు. మీడియా కూడా ఈయన కామెంట్స్ పై డిబేట్ లు పెట్టి శివాజీని మరింత పాపులర్ చేశారు. నిజంగానే శివాజీ బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తే టిఆర్పి మరింత పెరగడం ఖాయం అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు