Bigg Boss 7: కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే..!

Bigg Boss 7

బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో స్టార్ట్ కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. సప్టెంబర్ 3న స్టార్ట్ కానున్న ఈ షోను ఎప్పటిలాగానే నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇటీవలే రిలీజైన ప్రోమో షో మీద ఆసక్తి పెంచగా కంటెస్టెంట్స్ లిస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచేస్తోంది. లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గానే కనిపిస్తోంది ఈ సీజన్ కంటెస్టెంట్స్ లిస్ట్.

ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ ప్రచారం జరుగుతున్న లిస్ట్ లో మన్మధుడు హీరోయిన్ అన్షు, టీవీ9 న్యూస్ రీడర్ ప్రత్యూష, చక్రవాకం ఫేమ్ సాగర్, కమెడియన్ మహేష్, బులెట్ భాస్కర్, రియాజ్, సింగర్ దామిని, యూట్యూబర్ అనిల్ గీలా, కొరియోగ్రాఫర్ సందీప్, జబర్దస్త్ తేజ, శీతల్, అమర్ దీప్, ప్రియాంక, యావర్, పూజ, ప్రశాంత్, అంజలి, క్రాంతి, గౌతమ్ ఉన్నారు.

షో స్టార్టింగ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో ఈ సారి షో ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి మొదలైంది. గత సీజన్ పెద్దగా అలరించని నేపథ్యంలో ఈ సీజన్ లో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటాయా లేదా అన్న ఆసక్తి నెలకొంది ఆడియెన్స్ లో. ఆ మధ్య ఈ షోకి హోస్ట్ గా నాగార్జున ఉండరని, రాణా ఉండచ్చని కూడా ప్రచారం జరిగింది.

- Advertisement -

ప్రతి సీజన్లో లాగే ఈ సీజన్లో కూడా మేల్ కంటెస్టెంట్స్ విన్ అవుతారా లేక ఈసారైనా ఫీమేల్ కంటెస్టెంట్స్ గెలుస్తారా అన్న ఆసక్తి నెలకొంది నెటిజన్స్ లో. మరి, ఈ సీజన్లో ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయో, ఎవరికి ప్లస్ అవుతుందో, ఎవరికీ మైనస్ అవుతుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు