Bigboss season 7 : బిగ్‌బాస్‌కి వెళితే డైవర్స్… డ్యాన్సర్‌కి భార్య మాస్ వార్నింగ్

Bigboss season 7

తెలుగులో మోస్ట్ పాపులర్ టీవీ షో బిగ్‌బాస్. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఏడో సీజన్‌కు సిద్ధమవుతుంది. దీనికి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి వినూత్నంగా, కొత్తగా ఉంటుందని నాగ్ ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలతో ఓ క్లారిటీ ఇచ్చారు. ఉల్టా.. పల్టా అంటూ ఓ డైలాగ్ కూడా చెబుతున్నారు. మరి దీని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలంటే, ఏడో సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సీజన్‌లో పాల్గొనవారి లిస్ట్ ఇదే అంటూ 20 మంది పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అందులో మన ఓంకార్ అన్నయ్య హోస్ట్‌గా వచ్చిన ఆటతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న డ్యాన్సర్ సందీప్ (ఆట సందీప్) కూడా ఉన్నాడు. కొన్ని రోజుల్లోనే సందీప్ బిగ్ బాస్ హౌస్‌లో కనిపించబోతున్నాడని పక్కా సమాచారం. అయితే బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత సందీప్ ఇంట్లో చాలా గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.

ఫేమస్ అవ్వడానికి సందీప్ పడరాని పాట్లు పడుతున్నాడు. ఇటీవల భార్య ముందే గర్ల్ ఫ్రెండ్‌కి లిప్ కిస్ ఇస్తా అంటూ పబ్లిక్‌గా చెప్పాడు. దీని తన భార్య జ్యోతి రాజ్‌కి సందీప్ స్టేజ్ పైనే పెద్ద గొడవ జరిగింది. అదంతా పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా… ఫేమస్ అవ్వడానికి సందీప్ ఎలా ట్రై చేస్తున్నాడో ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో తెలిసిపోయింది. అలాంటి సందీప్ బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత వెంటనే ఒకే చెప్పాడట. కానీ, భార్య జ్యోతి రాజ్ మాత్రం సందీప్ బిగ్ బాస్‌కి వెళ్లడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదని సమాచారం.

- Advertisement -

దీంతో భార్యకు ఇష్టం లేకున్నా, బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడానికి రెడీ అయిపోయాడట సందీప్. దీంతో బిగ్ బాస్ హౌస్‌కి వెళితే డైవర్స్ ఇస్తానని కూడా జ్యోతి రాజ్ తెగిసి చెప్పేసిందని టాక్. అయినా, వచ్చిన సదావకాశాన్ని వదులుకోనని సందీప్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి రెడీ అయిపోయాడని సమాచారం. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, ఒక వేళ నిజమే అయితే బిగ్ బాస్ ఆఫర్ పండంటి కాపురంలో చిచ్చు పెట్టిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు