Aishwarya Rajesh: ఆటోలో ఓ వ్యక్తి తో.. ఐశ్వర్య రాజేష్ రొమాన్స్..!

Aishwarya Rajesh

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు హీరోయినే అయినా కోలీవుడ్ లోనే ఆమెకు మంచి పేరు వచ్చింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో ఎక్కువగా నటించింది ఐశ్వర్య రాజేష్. 2019లో మిస్ మ్యాచ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా ఇప్పటివరకు 50 సినిమాలలో హీరోయిన్ గా నటించింది ఐశ్వర్య. మిగతా హీరోయిన్లతో పోలిస్తే అందం విషయంలో కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ నటన పరంగా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఎలాంటి పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. ఇక తెలుగులో ఆమె కౌసల్య కృష్ణమూర్తి, టక్ జగదీష్, రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలలో నటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ గతంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. “నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఓ రోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. ఇక్కడి నుండి తిరిగి ఇంటికి రావడానికి షేర్ ఆటో ఎక్కాను.

షేర్ ఆటో కావడంతో అందులో నాతోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆటోలో వెళుతున్న సమయంలో అతడు నాతో తప్పుగా ప్రవర్తించాడు. నాపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో నేను ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను. ఆ తర్వాత ఆటో ఆపించి మరీ అతడిని విపరీతంగా తిట్టాను. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాను” అని తెలిపింది. మహిళలకు రక్షణ లేకుండా పోతుందనివా పోయింది ఐశ్వర్య రాజేష్. దీంతో ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు