Rajnikanth sridevi love story : శ్రీదేవిని మోసం చేసిన రజినీకాంత్.. అందుకే బ్రేకప్ అయ్యిందా..?

Rajnikanth sridevi love story

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే నెల రోజుల ముందు నుండే పండగ సంబరాలు చేసుకుంటారు. ఏకంగా ఐటీ కంపెనీలకు సెలవు ఇచ్చే అంత క్రేజ్ ఆయన సొంతం. రజినీకాంత్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే అప్పట్లో శ్రీదేవి – రజనీకాంత్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

వీరిద్దరూ కలిసి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో మొత్తంగా 22 సినిమాలలో నటించారు. తెరమీద మాత్రమే కాకుండా వీరిద్దరికి తెరవెనక కూడా మంచి స్నేహం ఉండేది. రజనీకాంత్ పెళ్లికి ముందు శ్రీదేవి ఇంటికి తరచూ వెళ్లేవారట. అప్పటికే శ్రీదేవి కమల్ హాసన్ తో ప్రేమలో పడి మోసపోయింది. ఆ బాధలో ఉన్న శ్రీదేవి ఇంటికి రజనీకాంత్ తరచూ వెళ్లడంతో అతడిని గుడ్డిగా నమ్మేసి ప్రేమలో పడిందట శ్రీదేవి.

తనను రజనీ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని ఎన్నో అశలు పెట్టుకుందట. అలా ఓ రోజు తనని పెళ్లి చేసుకోమని రజనీకాంత్ ముందు శ్రీదేవి ప్రపోజల్ పెట్టగా.. రజనీ మాత్రం నీమీద నాకు అటువంటి ఉద్దేశం లేదని.. మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పారట. దీంతో పట్టరాని కోపం, బాధతో రజినీకాంత్ పై మండిపడిందట శ్రీదేవి. అప్పటినుండి రజనీకాంత్ ని దూరం పెట్టేసిందట శ్రీదేవి. అప్పట్లో ఈ విషయం తమిళనాడు మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు