Nidhhi Agerwal: బంపర్ ఆఫర్ కొట్టేసిన నిధి అగర్వాల్.. ఏకంగా ఆ హీరోతోనే ?

Nidhhi Agerwal

గ్లామర్ కావాల్సినంత ఉన్న కూడా కాలం కలిసి రాక స్టార్ హీరోయిన్ స్టేటస్ కు అంగుళం దూరంలో ఆగిపోయింది హీరోయిన్ నిధి అగర్వాల్. నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచమైన నిధి అగర్వాల్ మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో నటించిన నిధి, రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి సక్సెస్ ను చూసింది.

అదేంటో మరి దురదృష్టం కు నిధి అగర్వాల్ బహుశా దగ్గరి చుట్టం కాబోలు.. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన కూడా ఈ హీరోయిన్ తెలుగులో బిజీ హీరోయిన్ అవ్వలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత కోలీవుడ్ లో కొద్దీ రోజులు హల్చల్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ హుటాహుటిన మొదలై అర్థాంతరంగా ఆగిపోయింది. హరిహరవీరమల్లు సినిమా రిలీజైతే తన కెరీర్ కాసింతైన ముందుకెళ్తుందనుకుంటే ఆ సినిమా మధ్యలో ఆగిపోయి నిధి అగర్వాల్ కు మళ్ళీ అవకాశాల కోసం ఎదురుచూసే డెబ్యూ హీరోయిన్ పరిస్థితిని తీసుకొచ్చింది.

ఇక లేటెస్ట్ గా నిధి అగర్వాల్ ఒక బంపర్ అఫర్ ను కొట్టేసిందని ఒక న్యూస్ వైరల్ గా మారింది. గతకొద్ది రోజులుగా షూటింగ్ లకు దూరంగా ఉంటున్న నిధి అగర్వాల్ ఇటీవలనే హైదరాబాద్ కు చేరుకొని ఒక పెద్ద మూవీ ఆడిషన్ కు హాజరైందట. ఇంతకు ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో రాబోతున్న రాజా డీలక్స్ ( వర్కింగ్ టైటిల్ ). ఈ సినిమాలో హీరోయిన్ కోసం గాను నిధి అగర్వాల్ ను సెలెక్ట్ చేసారంట.

- Advertisement -

నిన్న నిధి అగర్వాల్ హైదరాబాద్ కు వచ్చి ఆడిషన్ కూడా ఇచ్చిందని టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుందట. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న సలార్ సినిమా రిలీజ్ తరువాత రాజా డీలక్స్ సినిమా రెగ్యులర్ అప్డేట్స్ అందిస్తారని టాక్. ఏది ఏమైనా మొత్తానికి ఇన్నాళ్ల నిరీక్షణకు నిధి అగర్వాల్ కు ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు