Sreeleela cast : శ్రీలీల క్యాస్ట్ వల్లే ఇన్ని సినిమా ఆఫర్స్ వస్తున్నాయా.. ?

Sreeleela cast

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల గురించి అందరికి తెలిసిందే. ధమాకా సినిమా రిలీజ్ తరువాత టాలీవుడ్ లో సెన్సేషన్ మారిన శ్రీలీల దాదాపు ఇప్పుడు 10 సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. చిన్న, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్టార్ హీరోయిన్స్ కన్నాకూడ బిజీ హీరోయిన్ అయిపొయింది.

అయితే ఒక్కసారిగా శ్రీలీల ఇంతగా పాపులర్ అయ్యి వరుస సినిమాలు చేయడానికి కారణంమేంటని చాలా మందికి అంతుపట్టలేదు. శ్రీలీల నటించిన ధమాకా సినిమా ప్రమోషన్స్ లో ఆమె తెలుగమ్మాయినే అని చెప్పడంతో శ్రీలీల మొదటిసారి ట్రేండింగ్ లోకి వచ్చింది. ఇక దానికి తోడు శ్రీలీల మంచి డాన్సర్ కావడంతో సినిమా ఆఫర్స్ కూడా ఒకటి తరువాత ఒకటి బాగానే వచ్చాయి. అయితే ఈ రెండు విషయాలు అందరికి తెలిసినవే కాగా శ్రీలీల గురించి ఎవరికీ తెలియని మరో విషయం కూడా ఉంది. అదేంటంటే ఆమె క్యాస్ట్ .. శ్రీలీల వరుస సినిమాలు కారణం ఆమె టాలెంట్ ఎంత హెల్ప్ అయిందో అంతకంటే ఒక మీటర్ ఎక్కువే ఆమె క్యాస్ట్ కారణమైందని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే… శ్రీలీల ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సూరపనేని శుభకర రావు, మరియు బెంగుళూరుకు చెందిన స్వర్ణలత దంపతులకు పుట్టింది. శ్రీలీల మెడికల్ స్టూడెంట్ గా ఉన్న సమయంలో యాక్టింగ్ మీద ఫ్యాషన్ తో ఆమె ఆడిషన్స్ ఇస్తుండటంతో కన్నడలో ఆమె కిస్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇక ఆ తరువాత తెలుగులో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ధమాకా సినిమాతో బాగా పాపులర్ అయింది. అయితే శ్రీలీల కమ్మ అనే క్యాస్ట్ చెందిన అమ్మాయని అందుకే శ్రీలీలకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని ఒక వాదన ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తుంది.

- Advertisement -

ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ కూడా శ్రీలీలను పదే పదే వెనకేసుకొస్తుండటానికి కారణం కూడా శ్రీలీల క్యాస్ట్ వల్లనే అని తెలుస్తోంది. సాధారణంగా యంగ్ హీరోయిన్ కనిపిస్తే చాలు ఎదో ఒకటి మాట్లాడుతూ హీరోయిన్ లను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే బాలయ్య శ్రీలీలతో మాత్రం మంచిగా ఉండటానికి కారణం తన క్యాస్ట్ కు చెందిన అమ్మాయి అవడం వల్లనే అని టాక్ నడుస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు