Rashmika Mandanna: రష్మిక సైలెన్స్ కు కారణమేంటి ?

Rashmika Mandanna

ఈ మధ్య కాలంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైలెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్దీ రోజుల క్రితం వరకు ఇంస్టాగ్రామ్ పోస్ట్ లతో.. సరదా సరదా స్టిల్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేసే రష్మిక ఇటీవల కాలంలో మాత్రం వాటన్నింటికి కాస్త దూరంగా ఉంటోంది. నిన్న, మొన్నటి వరకు హుషారుగా ఉండే రష్మిక ఒక్కసారిగా సైలెంట్ అవడంతో రష్మికకు ఏమైందనే అనుమానాలు వస్తున్నాయి. రష్మికకు ఆరోగ్య సమస్యలేమైన వచ్చాయా లేక పర్సనల్ లైఫ్ టెన్షన్స్ పెరిగాయా అనే దిశగా అందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

ప్రస్తుతం రష్మిక మందన్న అల్లు అర్జున్ తో కలిసి మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే ఇటీవలనే ఆమె రణ్ బీర్ హీరోగా నటిస్తోన్న యానిమల్ సినిమా షూటింగ్ కూడా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసింది. ఇవి రెండు కాకుండా రెయిన్బో అనే విమెన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలోనూ రష్మిక నటిస్తుంది. శాకుంతలం సినిమా ఫేం దేవ్ మహాన్ ఈ రెయిన్బో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇటీవలనే ఆమె హీరో ధనుష్ తో కూడా ఒక సినిమా కమిట్ అయ్యింది. ఇలా వరుస సినిమాలు చేస్తున్న రష్మిక సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండటం, సడన్ గా డల్ అయిపోవడం ఎవరికీ అంతుపట్టకుండా ఉంది.

అయితే అసలు నిజం ఏంటంటే.. రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి.. ఏ పోస్ట్ పెట్టిన కూడా రష్మిక పై నెగిటివ్ గా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వార్తలు రాయడం సర్వసాధారణమైంది. దాంతో రష్మిక సోషల్ మీడియా నెగిటివిటీ నుంచి కాస్త దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కావాలనే ఆమె ఇటీవల కాలంలో కాస్త స్పీడ్ తగ్గించింది. బర్త్ డే లకు పండగలకు విషెష్ చెప్పడం తప్ప, మరేవిధంగాను ఆమె సోషల్ మీడియాలో రియాక్ట్ అవడం లేదు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపింది. కాగా లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ లో ఆయన మ్యారేజ్ హింట్ ఇచ్చేలా ఒక అమ్మాయి హ్యాండ్ పట్టుకొని ఒక పోస్ట్ పెట్టాడు. అయితే చాలా మంది ఆ హ్యాండ్ ఖచ్చితంగా రష్మిక దే అయ్యుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు