Rashmika : విజయ్ దేవరకొండతో సినిమా మిస్ చేసుకున్నసాయి పల్లవి

ఏ డైరెక్టర్ అయిన కథ రాసుకునే ముందు ఫలానా హీరో లేదా ఫలానా హీరోయిన్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని భావిస్తాడు. అలాగే వాళ్ళతో మాత్రమే ఆ కథని సినిమాగా చేస్తా అని భీష్మించుకుని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొన్ని రకాల వల్ల వాళ్ళు అనుకున్న హీరో గాని హీరోయిన్ తో సినిమా చేయడం వీలు పడదు.ఇలాంటి పరిస్థితే ఒక యంగ్ డైరెక్టర్ కి కూడా వచ్చింది.

ఇక విషయానికొస్తే అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అప్పటిదాకా ఆర్టిస్ట్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి చేతికందొచ్చిన సినిమాలు చేస్తూ పోయిన విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమా హిట్ తో తాను చేయబోయే తరువాతి సినిమాల విషయంలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ తరువాత పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం అనే సినిమా చేయగా అది సూపర్ హిట్టై మంచి వసూళ్ళని రాబట్టింది.

ఆ తరువాత విజయ్ నటించిన తమిళ్, తెలుగు బైలాంగ్వేజికల్ సినిమాగా వచ్చిన నోటా సినిమా ఆ తరువాత వచ్చిన టాక్సీవాలా సినిమాలు ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయాయి. అప్పుడే విజయ్ కాస్త ఫోకస్ చేసి, భరత్ కమ్మ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ అనే సినిమా కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండటం వల్ల ఆ క్యారెక్టర్ కి గాను భరత్ కమ్మ సాయి పల్లవి తీసుకుందాం అనుకున్నాడట, నిజానికి ఆమెని మైండ్ లో పెట్టుకునే ఆ క్యారెక్టర్ రాసుకున్నడటా, కానీ మరి ఎందుకో సాయి పల్లవికి డియర్ కామ్రేడ్ కథ వినిపించగానే వెంటనే చేయను అని చెప్పేసిందట. దాంతో డైరెక్టర్ చాలా ఫీల్ అయ్యి. ఇక ఆ తరువాత చేసేదేం లేక గీత గోవిందం సినిమాతో రష్మిక- విజయ్ దేవరకొండ పెయిర్ బాగా హిట్టవ్వడంతో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే కథ పరంగా చూస్తే సాయి పల్లవి ఈ సినిమా చేసుంటే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయ్యేదని అందరు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు