Mokshagna Teja Tollywood Entry: నందమూరి ఫ్యాన్స్‌ రెడీగా ఉండండి… వారసుడు ఎంట్రీ డేట్ వచ్చేసింది?

Mokshagna Teja Tollywood Entry

నందమూరి ఫ్యాన్స్‌లో ఎప్పటి నుంచో ఉన్న తీరని కోరిక.. నందమూరి వారసుడు మోక్షజ్ఞని వెండితెరపై చూడటం. మోక్షజ్ఞకి ఇప్పటికే 29 ఏళ్లు వచ్చాయి. ఇంకెప్పుడు హీరోగా అరంగెట్రం చేస్తాడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ వెండితెరపై కనిపించడం కష్టమే అంటూ న్యూస్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్ గందరగోళానికి గురి అయ్యారు. ఇటీవల ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా మోక్షజ్ఞ ఎంట్రీకి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.

కానీ, బాలయ్య ఫ్యాన్స్‌లో మాత్రం చిన్న హోప్. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని. అలాంటి వారికి గుడ్ న్యూస్. నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండితెరపై అరంగేట్రం చేయడానికి సర్వం సిద్ధమైంది. మరి కొన్ని నెలల్లోనే మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నాడట అంటే అవును అనే అంటున్నారు ఫిల్మ్ సర్కిల్స్ లో ఉన్న వాళ్లు. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా ఇటీవల లీక్ అయింది.

ఏం ఫోటో… మోక్షజ్ఞపై సినిమా స్టార్ట్ అయిందా… షూటింగ్ స్పాట్ ఫోటోనా.. అని ఆలోచిస్తున్నారా? అవునండి మూవీ షూటింగ్ స్పాట్ ఫోటోనే. కానీ, మోక్షజ్ఞ సినిమాలోనిది కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న భగవంత్ కేసరి మూవీలోని షూటింగ్ స్పాట్‌లో మోక్షజ్ఞ ఉన్న ఫోటో. ఈ ఫోటోలో శ్రీలీలతో మోక్షజ్ఞ మాట్లాడుతూ కనిపించాడు. ఇదింతా పక్కన పెడితే, భగవంత్ కేసరిలో మోక్షజ్ఞ ఒక కీలక పాత్ర చేస్తున్నాడని గత కొన్ని రోజుల నుంచి న్యూస్ వస్తోంది.

- Advertisement -

ఈ గాసిప్.. ఈ ఫోటోతో కన్ఫామ్ అయిపోయింది. భగవంత్ కేసరి మూవీ షూటింగ్ లో మోక్షజ్ఞ పాల్గొన్నాడట. ఆయన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి అయిందని టాక్. అలా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నాడు అన్నమాట. భగవంత్ కేసరిని అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నారు. అంటే నందమూరి వారసుడు వెండితెరపై కనిపించబోయే డేట్ కూడా అక్టోబర్ 19నే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు