Naa saami ranga: నాగార్జునకు భార్య అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల కలల రాకుమారుడిగా, మన్మధుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న ఒకప్పటి స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు నాగార్జున. నిన్నే పెళ్లాడతా, మన్మధుడు లాంటి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు.

ఫ్యామిలీ సినిమాలు, లవ్ స్టోరీస్ తో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న నాగార్జున.. రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాలవల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటికే వారికి నాగచైతన్య జన్మించారు. ఆ తర్వాత నాగార్జున.. హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఓ మూవీ షూటింగ్ లో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు ఓరోజు తన కుమారుడిని పెళ్లి చేసుకోమని ఓ హీరోయిన్ వద్దకి ప్రపోజల్ తీసుకువచ్చారట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ సుమలత. చూడడానికి లక్షణంగా ఉన్నావని, నీ హైట్ కి తగ్గ కుర్రాడు విదేశాలలో ఉన్నాడు.. పెళ్లి చేసుకుంటావా అని సుమలతతో చాలాసార్లు సరదాగా మాట్లాడేవారట. ఆ వ్యక్తి ఎవరు అని అడగగా నా కొడుకు నాగార్జున అని బదులు ఇచ్చేవారట నాగేశ్వరరావు. దీంతో సుమలతకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడినుండి వెళ్ళిపోయేదట. ఈ విషయాన్ని సుమలత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో సుమలత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు