Naa Sami Ranga: హమ్మయ్యా..! మొత్తానికి బుద్ది వచ్చింది.

Naa Sami Ranga

నాగార్జున… అక్కినేని నాగేశ్వరరావుకి సరిగ్గా సరిపోయే వారసుడు. ఏఎన్నార్ ఎంతో కష్టపడి కట్టుకున్న అక్కినేని ఎంపైర్‌కి రెట్టింపు క్రేజ్ తీసుకొచ్చే దమ్మున్న కథనాయకుడు. ఇదింత కొన్నెళ్ల క్రితం. ఆయన నుంచి చివరిగా వచ్చిన రెండు సినిమాలు (వైల్డ్ డాగ్, ది ఘోస్ట్) చూస్తే, ఇది నాగార్జునేనా? ఆయనేంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు? గన్ పట్టుకుని పది మందిని కాల్చి చంపేస్తే సినిమా హిట్ అవుతుందని బ్రమలో ఉన్నాడా? దీని నుంచి ఎప్పుడు బయటికి వస్తాడు అంటూ స్వయంగా అక్కినేని ఫ్యాన్స్‌కే ఇలాంటి సందేహాలు రాక మానలేదు.

కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 100వ సినిమా దగ్గరకి వస్తున్న కొద్ది ఫ్యాన్స్‌లో ఇదే దిగులు. కనీసం 99వ సినిమా అయినాతో అయిన సరైనా కమ్ బ్యాక్ ఇచ్చి, 100 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఇలాంటి టైంలో నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని 99వ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది.

బెజవాడ ప్రసన్న కుమార్ అందించిన కథను బెన్నీ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి నా సామి రంగా అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఒక గ్లింప్స్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌ని చూస్తే, నాగ్ గాడిలో పడినట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, గన్స్‌తో ఫైట్స్, గర్స్‌తో రొమాన్స్ ఈ మూవీలో లేవని తెలుసిపోతుంది. ప్రస్తుతం ఆడియన్స్‌కి కావాల్సిన మాస్ లుక్స్, ఎలివేషన్స్ సీన్స్ పుష్కలకంగా ఉన్నాయని అర్థమవుతుంది.

- Advertisement -

ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ “నా సామి రంగా.. నాగార్జున మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అనుకున్నట్టు నా సామి రంగా మూవీ హిట్ అయితే, నాగ్ 100వ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగి ఉంటాయి.

గత సినిమాలు పక్కనపెడితే, నా సామి రంగా గ్లింప్స్‌తోనే మంచి హైప్‌ను అయితే తెచ్చుకుంది. మూవీ కూడా హిట్ అవుతుందనే నమ్మకాన్ని అక్కినేని ఫ్యాన్స్‌లో క్రియేట్ చేసింది. అయితే గ్లింప్స్‌కి మాత్రమే పాజిటివ్ టాక్ సరిపోదు. డైరెక్టర్ విజయ్ బిన్ని కథ, కథనంపై స్ట్రాంగ్ ఉండాల్సిందే. ఏ మాత్రం మైనస్ అయినా, నాగ్ 99వ చిత్రం చేదు ఫలితాన్నే ఇస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు