Danush’s #D51: నాగార్జున ట్రాక్ లో పడినట్లేనా..?

Danush’s #D51

గత కొంతకాలంగా వరుస డిజాస్టర్స్ ఎదుర్కొంటున్న నాగార్జున ఇప్పుడు ట్రాక్ లో పడుతున్నట్లు అనిపిస్తుంది. 2024 సంక్రాంతికి ‘నా సామిరంగా’ సినిమా రిలీజ్ అవనున్నట్లు అనౌన్స్ చేసిన నాగార్జున, శేఖర్ కమ్ముల, ధనుష్ ల కాంబినేషన్లో రానున్న పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడని కన్ఫార్మ్ అయ్యింది.

నాగార్జున బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన నా సామిరంగా గ్లిమ్ప్స్ లో వీడియోలో ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్ కనిపించి ఆకట్టుకున్నాడు నాగార్జున. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా సంక్రాతి రేస్ లో తలపడనుంది. శేఖర్ కమ్ముల ధనుష్ ల సినిమాలో నాగార్జున నటించనున్నాడని ముందుగా ప్రచారం జరిగినట్టే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది సినిమా యూనిట్.

సోగ్గాడే చిన్ని నాయన సినిమా తర్వాత నాగార్జునకి చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటానికి కారణం స్టోరీ సెలెక్షన్లో తప్పులే అని చెప్పాలి. నాగచైతన్యతో కలిసి నటించిన బంగార్రాజు సినిమా పర్వాలేదని అనిపించినప్పటికీ ఆ సినిమా ఇద్దరికీ ప్లస్ అవ్వలేకపోయింది. ప్రస్తుతం నాగార్జున లైనప్ లో ఉన్న రెండు సినిమాలు చూస్తుంటే నాగార్జునకి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాయన్న నమ్మకం కలుగుతోంది.

- Advertisement -

వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న నాగార్జున కి హిట్ తప్పనిసరైన పరిస్థితిలో వస్తున్న నా సామిరంగా సినిమా మీద ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.చాలా కాలం తర్వాత నాగార్జున పక్కా మాస్ లుక్ తో కనిపించటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒక్క గ్లిమ్ప్స్ తోనే అంచనాలు పెంచేసిన నా సామిరంగా సినిమా ద్వారా నాగార్జునకి బ్లాక్ బస్టర్ వస్తుందా లేదా తెలియాలంటే 2024 సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు