Manchu vishnu : మంచు ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు.. ఈ సారి విష్ణు vs మంచు లక్ష్మీ

Manchu vishnu

మంచు వారి ఇంట విభేదాలు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్ పెళ్లి తర్వాత ఈ వార్తలకు మరింత బలం వచ్చింది. మనోజ్‌, విష్ణు మధ్య అసలు పడటం లేదని, ఆస్తుల పంపకం జరగాలని ఇద్దరు అన్నదమ్ములు మంచు మోహన్ బాబుతో ప్రతి రోజు గొడవకు దిగుతున్నారు అంటూ తెగ వార్తలు వచ్చాయి. తర్వాత ఓ వీడియో కూడా వచ్చింది. విష్ణు తనను కొట్టడానికి వచ్చాడు అంటూ మనోజ్ చెబుతున్న వీడియో అందరూ చూశారు.

తర్వాత అది ఓ రియాలిటీ షో అని ఏదో కవర్ చేశారు. అయినా, మంచు వారి ఇంట్లో విభేదాల గురించి ఎప్పుడు ఏదో ఒక టాక్ నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో విభేదాలు ఏం మాత్రం తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే మరింత పెరిగియాని తెలుస్తోంది. తాజాగా రాఖీ సందర్భంగా మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో తన తమ్ముడు మంచు మనోజ్ కి రాఖీ కడుతుంది.

రాఖీ తర్వాత ఇద్దరు ఒక రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేశారట. ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే మంచు విష్ణుకి మంచు లక్ష్మీ రాఖీ కట్టలేదా? ఆ ఫోటోలు ఎందుకు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టలేదు? అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి మనోజ్-మంచు లక్ష్మీ మధ్య మంచి అండర్ స్టాడింగ్ ఉంటుంది. భూమ మౌనిక పెళ్లిని మంచు ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించినా, లక్ష్మీ అక్కయే తన సొంత ఇంట్లో ఘనంగా మనోజ్ పెళ్లి జరిపించింది.

- Advertisement -

అయితే ఇదే విష్ణుకు మంచు లక్ష్మీ మధ్య గ్యాప్ రావడానికి కారణం అని తెలుస్తోంది. తమకు ఇష్టం లేని పెళ్లిని మనోజ్ కి మంచు లక్ష్మీ ఒక ఛాలేంజ్ గా తీసుకుని చేసిందని, కోపం కూడా ఉందట. ఆ పెళ్లి నుంచి మంచు లక్ష్మీ, విష్ణు మధ్య మాటలు కూడా లేవని ఇండస్ట్రీ లో టాక్ ఉండేది. అయితే ఇప్పుడు రాఖీ పండగలో భాగంగా మంచు లక్ష్మీకి విష్ణు మధ్య విభేదాలు ఉన్నాయని మరోసారి అందరికి తెలిసిపోయింది.

అయితే మంచు ఫ్యామిలీలో ఇన్ని గొడవలు జరుగుతుంటే, ఇండస్ట్రీకే పెద్ద తలకాయ అని చెప్పుకునే మోహన్ బాబు ఎం చేస్తున్నాడో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు