Thalaivar170: రజినీని నాని రిజెక్ట్ చేయడానికి కారణమిదే?

Thalaivar170:

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ తరువాత జై భీమ్ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి మరో రెండు నెలల సమయం అవుతుంది. ప్రస్తుతం జైలర్ సూపర్ సక్సెస్ తో రజినీకాంత్ హిమాయలయాలకు వెళ్లారు. గత నాలుగేళ్లుగా హిమాలయాల యాత్ర కి గ్యాప్ ఇచ్చిన రజిని ఇప్పుడే అక్కడికి తన స్నేహితులతో గడుపుతున్నారు. ఆయన వచ్చిన తరవాతే జ్ఞానవేల్ సినిమా పట్టాలెక్కుతుంది.

అయితే రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మరో నటుడు వచ్చి చేరాడు. అతనెవరో కాదు మన శర్వానంద్. అవును.. రజినీకాంత్ 170వ సినిమాలో శర్వానంద్ కూడా నటిస్తున్నాడని ఇప్పుడు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ జ్ఞానవేల్ శర్వానంద్ కి కథ చెప్పాడని, స్టోరీ విన్నా, రజినీకాంత్ తో సినిమా కాబట్టి వెంటనే ఒకే చెప్పేసాడని సమాచారం.

అయితే ఈ సినిమాలో శర్వానంద్ విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ న్యూస్ చిత్ర యూనిట్ నుండయితే అఫిషియల్ గా రాలేదు. అందువల్ల ఏది కూడా కంఫర్మ్ గా చెప్పలేము.

- Advertisement -

ఇదిలా ఉండగా ఈ రోల్ ముందుగా నాని కి వచ్చిందని, అయితే విలన్ పాత్ర అయ్యేసరికి నాని రిజెక్ట్ చేసాడని, ఆ తర్వాతే శర్వానంద్ కి ఈ ఆఫర్ వెళ్లిందని టాక్ నడుస్తుంది. ఇందులో ఏది నిజమో చిత్ర డైరెక్టరే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు