Mirnalini ravi: ఈ టిక్ టాక్ భామకి రెండో హిట్టొచ్చేది ఎప్పుడో?

Mirnalini Ravi:

ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా హీరోయిన్ అవ్వాలంటే ఆడిషన్లు ఇవ్వాల్సి వచ్చేది. లేదా చిన్న చిన్న రోల్స్ చేస్తూ క్లిక్ అయ్యే హీరోయిన్లు ఉన్నారు. కానీ గత కొన్నేళ్లుగా టిక్ టాక్ లు, ఇంస్టాగ్రామ్ లు, యూట్యూబ్ లలో ఫేమ్ సంపాదించి హీరోయిన్లు కూడా అవుతున్నారు. చాందిని చౌదరి, వైష్ణవి అలా వచ్చినవారే. వీరిలాగే తమిళ్ టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయి హీరోయిన్ గా సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్న హీరోయిన్ మిర్నలిని రవి.

సూపర్ డీలక్స్ తో పరిచయమైన ఈ భామ తెలుగులో గద్దల కొండ గణేష్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ మూవీతో హిట్ కొట్టినా అందులో సెకండ్ లీడ్ ఇవ్వడం వల్ల ఎక్కువ క్రెడిట్ రాలేదు. కానీ సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ తరువాత చేసిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. చివరగా తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న “లవ్ గురు” సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.

అయితే మిర్నలిని మూవీస్ ట్రాక్ రికార్డు తెలిసి కూడా మేకర్స్ ఛాన్స్ ఇచ్చారంటే అది ఈ హీరోయిన్ లక్ అనే చెప్పాలి. మరి వచ్చిన ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందా లేదా చూడాలి. ఈ సినిమా హిట్ అయితే ఓవరాల్ గా మిర్నలిని రవి కెరీర్ లో రెండో హిట్ గా నిలుస్తుంది. ఇక లవ్ గురు హిట్ మీదే ఈ హీరోయిన్ ఆశలన్నీ ఉన్నాయని చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు