Chandramukhi2: డిజాస్టర్ అయ్యే సినిమాపై ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్?

Chandramukhi2:

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఒక్క సినిమాయే చేసినా, డబ్బింగ్ సినిమాల ద్వారా ఎప్పటికి పలకరిస్తూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో వివాదాస్పద అంశాలకు ఎప్పుడు స్పందించే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ సౌత్ ని మాత్రం ఎప్పుడూ పొగుడుతూనే ఉంటుంది. కానీ ఈమె ఆశించిన గుర్తింపు మాత్రం సౌత్ సినిమాల్లో దక్కడం లేదు. తెలుగులో ప్రభాస్ తో ఏక్ నిరంజన్ చేయగా ఆ సినిమా అంతగా ఆడలేదు. తమిళ్ లో చేసిన తలైవి కూడా ఏమి పెద్దగా ఆడలేదు.

అయినా ఆశ వదులుకోకుండా ఒక బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ లో నటించింది. అదే చంద్రముఖి2. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సౌత్ లో బిగ్గెస్ట్ హిట్ అవగా, దానికి సీక్వెల్ గానే ఈ సినిమా వస్తుంది. పార్ట్ వన్ డైరెక్ట్ చేసిన పి. వాసూయే దీనికి దర్శకత్వం వహించగా, రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాపై ముందు నుండి ఆడియన్స్ లో ఏమాత్రం అంచనాలు లేవు. డైరెక్టర్ ట్రాక్ రికార్డు వల్ల మాత్రమే కాకుండా, ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

అందుకే థియేటర్లో ఈ సినిమా ఆడదాని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. అయినప్పటికీ కంగనా రనౌత్ ఈ తమిళ సినిమాపై బాగానే నమ్మకం పెట్టుకుంది. పైగా అది హీరోతో పాటు హీరోయిన్ రోల్ కి సమానమైన స్కోప్ ఉండే రోల్ అది. అందుకే అంత నమ్మకంగా ఉంది. అటు బాలీవుడ్ అవకాశాలు వస్తున్నా, సౌత్ లోనూ పాగా వేయాలనుకున్న ఈ అమ్మడి ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి మరి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు