Kalki: బర్త్ డే పార్టీ లో రెచ్చిపోయిన దిశా పటని!

Kalki:

బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని ఇంస్టాగ్రామ్ లో చెలరేగిపోతుంది. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలే చేసినా, ఇంస్టాగ్రామ్ లో దాదాపు 59 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉంది. అయితే దీనికి కారణం ఎప్పుడూ తాను ఇంస్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉండడమే. ఫోటోషూట్ చేసినా, సినిమా అప్డేట్ చెప్పినా, లేదా ఏదైనా ఈవెంట్ కి వెళ్లినా, ఆఖరికి ఇంట్లో ఉన్నా సరే ఎదో ఒక స్టేటస్ పెడుతూ జనాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. అంతే కాదు బాలీవుడ్ లో అత్యధిక ఇంస్టా ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది.

ఇక తాజాగా ఈ హీరోయిన్ అంబానీ తన ఇంట్లో చేసిన వినాయక ఫంక్షన్ కి హాజరయ్యింది. చక్కగా చీరకట్టులో అక్కడికి వెళ్లి ఫోటోలకు పోజులిచ్చిన ఈ భామ, కొన్ని గంటల్లోనే తన ఫ్రెండ్ హీరోయిన్ అయిన మౌని రాయ్ బర్త్ డే లో చిందేసింది. తన ఇంట్లోనే ఆ పార్టీ చేయగా, కేక్ కటింగ్ తర్వాత, ఫుల్ జోష్ లో పంజాబీ పబ్ సాంగ్స్ పై డాన్స్ చేస్తున్న స్టేటస్ పెట్టారు. ఇక అటు ఇంస్టాగ్రామ్ లోనే కాకుండా సినిమాల్లోనూ నటిస్తూ, ఫోటోషూట్లతో హడావిడి చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో యోధ అనే సినిమా చేసేయగా, సౌత్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. అందులో ఒకటి తమిళ్ లో సూర్య కంగువా, రెండోది తెలుగులో ప్రభాస్ నటిస్తున్న కల్కి2898AD. ఈ రెండు సినిమాలు 2024 లోనే రిలీజ్ అవుతాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు