Payal Rajput: ఇద్దరికీ హిట్ తప్పని సరి

అజయ్ భూపతి ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తీసిన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో ఎన్నో సంచలనాలు సృష్టించాడు. ఎన్నో వివాదాలు కూడా సృష్టించాడు. వీటన్నిటికీ కారణం ఇంతకుముందు ఆయన ఆర్జీవీ దగ్గర పని చేయడమే. ఆర్ఎక్స్ 100 సినిమా తీస్తున్నప్పుడు నీ సినిమా ఫెయిల్ అవుద్ది అని ఆర్జీవి అన్నా కూడా, నా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత హిట్ అవుతుందో నాకు ఐడియా ఉంది అంటూ ఆ సినిమాను తీశాడు.

ముందు ఆర్ఎక్స్ 100 సినిమాని మల్టీప్లెక్స్ లో చూసిన ఆడియన్స్ అందరూ ఇదేంటి సినిమా ఇలా ఉంది అని పెదవి విరిచారు.
కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా తర్వాత పలు ప్రొడక్షన్స్ హౌసెస్ నుంచి అజయ్ భూపతికి అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రవితేజ, నాగచైతన్య వంటి హీరోలకి తన నరేషన్ కూడా ఇచ్చాడు కానీ ఆ సినిమాలు పట్టాలెక్కలేదు.

చివరగా శర్వానంద్ మరియు సిద్దార్థ్ ను పెట్టి “మహాసముద్రం” సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు మంగళవారం అనే ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు అజయ్. దీనిలో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ గా కనిపించనుంది.

- Advertisement -

ఆర్ఎక్స్ 100 తరువాత వస్తున్న ఈ కాంబినేషన్ సినిమా అటు అజయ్ కి , పాయల్ కి ఖచ్చితంగా హిట్ ను అందించాల్సిందే. లేదంటే మళ్ళీ ఇంకో అవకాశం పట్టుకోవడానికి టైం పడుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ డీటెయిల్స్ ను రీసెంట్ రివీల్ చేశారు. అక్టోబర్ 21న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు ,తమిళ్, కన్నడ ,మలయాళ భాషల్లో నవంబర్ 17న రిలీజ్ కానుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు