Payal Rajput: ప్రియుడితో సరసాలాడుతున్న హీరోయిన్ – ప్రతిసారి పబ్లిక్ లో ఏంటి ఈ రచ్చ..

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచమైన పాయల్ రాజపుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పంజాబీ బ్యూటీ, ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో తన ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది.

అయితే ఇటీవలనే మంగళవారం సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం తన ప్రియుడితో రిలాక్స్ మోడ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలో మంగళవారం పేరుతో ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ పై స్వాతి గుణపాటి, సురేష్ వర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమవుతోంది. అలాగే పాయల్ నటించిన మాయాపేటిక అనే మరో చిన్న సినిమా ఈ నెల 30న విడుదలకి సిద్ధమవుతోంది.

ఇలా చేతిలో ఉన్న రెండు సినిమాలకు సంబందించిన వర్క్స్ కంప్లిట్ చేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తన ప్రియుడితో సమయం గడుపుతుంది. సౌరబ్ అనే పంజాబీ నటుడు, గాయకుడితో పాయల్ ప్రేమలో ఉన్న అందరికి సంగతి తెల్సిందే. గతంలో కూడా సౌరబ్ కి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఈ హాట్ బ్యూటీ, లేటెస్ట్ గా వీళ్లిద్దరు కలిసి రిలాక్స్ అవుతున్నట్టు తన ఇంస్టాగ్రామ్ లో మరోసారి స్టోరీ పెట్టింది. దాంతో పాయల్ పై ట్రోలర్స్ అంత ఎంజాయ్ చేస్తే చేసావ్ గాని ప్రతిసారీ ఇలా పోస్ట్ లు పెట్టి చెప్పనవసరం లేదంటూ.. మిమ్స్ వేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు