Production No.1: చాలాకష్టం అంటూనే రివీల్ చేసిన ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యమా బిజీ గా ఉన్నాడు. ఒక వైపు “పుష్ప ది రూల్” చేస్తూనే మరోవైపు తన ఆహా ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ని డెవలప్ చేసే పనుల్లో ఉన్నాడు. అయితే గత కొన్ని రోజుల కిందట అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆహా లో ప్రొడక్షన్ నెంబర్ 1 అనే పేరిట ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ ఏంటా అన్నది మాత్రం రివీల్ చేయలేదు. అది ఒక సినిమానా, లేదా వెబ్ సిరీస్ ఆ? లేక అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లాగా ఇదికూడా ఒక షో నా అన్నది తెలియక ఫ్యాన్స్ కూడా సందిగ్ధం లో ఉన్నారు.

ఇదిలా ఉండగా నిన్న ఆహా ఓటిటి నుండి దీనికి సంబంధించి ఒక అప్ డేట్ వచ్చింది. అల్లు అర్జున్ యొక్క ఈ ప్రాజెక్ట్ లో ఒక బ్లాక్ బస్టర్ హీరోయిన్ భాగం కానున్నదని ఆ హీరోయిన్ ఎవరో గెస్ చేయండి అని అల్లు అర్జున్ తో ఉన్న ఆ హీరోయిన్ పిక్ ని బ్యాక్ నుండి చూపిస్తూ ట్వీట్ వేశారు.

అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం చాలా సునాయాసంగా ఫ్యాన్స్ పసిగట్టి ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీ లీల అని తేల్చేసారు. అంతే కాదు ఆ ట్వీట్ కింద ఫొటోస్ పెట్టి మరి రివీల్ చేస్తూ, చాలా కష్టం అంటూ ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు. అయితే బ్యాక్ నుండి ఉన్న ఆ స్టిల్ లో ఆ హీరోయిన్ హైట్ చూసినా ఆ హెయిర్ చూసినా శ్రీ లీల అని ఎవరైనా చెప్తారు. పైగా వాళ్ళు వేసిన ఆ ట్వీట్ లో తానొక మాస్ డాన్సింగ్ క్వీన్ అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి తర్వాత బాగా డాన్స్ చేసే హీరోయిన్ శ్రీ లీలే. దాన్ని బట్టి కూడా ఈజీ గా చెప్పొచ్చు. ఇక త్వరలోనే మొదలవనున్న ఈ ప్రాజెక్ట్ ఏంటో తొందరగా రివీల్ చేయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు