Anand Devarakonda : ఎట్టకేలకు రిలీజ్ కి సిద్దమైన ” బేబీ “

ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబ్ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వస్తోన్న బేబీ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.

యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. హృదయ కాలేయం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయి రాజేష్. మొదటి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. వైవిధ్యమైన కథ, కథనంతో సినిమాని ప్రేమించి తీసే అతికొద్ది మంది దర్శకులలో సాయి రాజేష్ కూడా ఒకడు. అయితే తనలోని ప్రతిభని ప్రేక్షకులు గుర్తించడానికి మాత్రం కాస్త ఎక్కువ సమయం పట్టిందనే చెప్పాలి.

ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై SKN నిర్మిస్తున్నాడు. విజయ్ బుల్గాని సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన 3 పాటలు రిలీజై, యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ని సాధించాయి. దాంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై మంచి ఏర్పడ్డాయి. దాంతో సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలంటూ డిమాండ్ కూడా వచ్చింది. కానీ అన్ని చిన్న సినిమాలకి వచ్చినట్టే ఈ సినిమాకి కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యుస్ రావడంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ప్రస్తుతం అన్ని ఛాలెంజెస్ ని దాటుకొని వచ్చే జులై 14న ఈ సినిమాని గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు డైరెక్టర్ సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరీ ఈ సరైన ఎలాంటి వాయిదాలు లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుందో, లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు