Yash: బాలీవుడ్ భారీ ఆఫర్ కి నో చెప్పిన కెజిఎఫ్ స్టార్ !

కెజిఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యాష్, ఈ ఫిలిం సిరీస్ తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా కమిట్ అవ్వలేదు. గత కొద్దీ కాలంగా కథలు వింటున్న యాష్ ఇంతవరకు ఒక్క కథకి కూడా ఒకే చెప్పక పోవటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఇటీవలనే యాష్ కి బాలీవుడ్ నుంచి ఒక పెద్ద ఆఫర్ వచ్చిన కూడా నిర్మోహమాటంగా నో చెప్పేసాడంట.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా ఇండియా వైడ్ గా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.ఇండియాలోని సినీ పరిశ్రమలన్నిటిలో అంతగా గుర్తింపు లేని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసి, అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఈ సినిమా తరువాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా కమిట్ అయ్యాడు. ఇప్పటికే షూట్ చివరి దశకి చేరుకున్న ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడానికి కూడా సిద్ధంగా ఉంది. మరో పక్క ఈ సినిమాలో నటించిన మిగిత నటీనటులంతా కెజిఎఫ్ సినిమా పాపులారిటీతో వేరు వేరు సినిమాల్లో బిజీ అయ్యారు. కానీ హీరో యాష్ నెక్స్ట్ సినిమా గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవలనే యాష్ ఒక బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నడనే వార్తలు రాగా, లేటెస్ట్ గా ఈ సినిమాకి కూడా యాష్ నో చెప్పినట్టు తెలుస్తోంది.

- Advertisement -

దంగల్, చిచోరే లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ప్రస్తుతం రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలలో రామాయణ్ అనే సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనుంది. అయితే రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా అలియా భట్ నటించనున్నారు. ఇక రావణుడి పాత్ర కోసం యాష్ ని సంప్రదించగా యాష్ మాత్రం ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడంట. సాధారణంగా అందరు యాక్టర్స్ కి బాలీవుడ్ సినిమా చేయాలనే ఉత్సుకత ఉంటుంది. యాష్ కి కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనే ఉన్న, రావణుడి లాంటి నెగిటివ్ రోల్ లో నటించడం ఇష్టం లేని కారణంగా యాష్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడని టాక్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు