Urvashi Rautela Comments: హీరోయిన్ పాత్రలు పనికి రానివి.. ఊర్వశీ బోల్డ్ కామెంట్స్ వైరల్

సౌత్ ఇండస్ట్రీలో అయిన, నార్త్ ఇండస్ట్రీలో అయిన ప్రస్తుతం ఐటెం సాంగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలానే. కెరీర్ ప్రారంభంలో కేవలం బాలీవుడ్‌కే పరిమితం అయిన ఊర్వశీ.. తర్వాత తన సేవలను విస్తరించింది. ఏ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చినా వెంటనే వెళ్లి అక్కడ హీరోతో రెండు స్టెప్స్ వేసి నాలుగు రాళ్లు సంపాదిస్తుంది. అదే టైంలో మంచి క్రేజ్ ను కూడా తెచ్చుకుంటుంది. అయితే ఊర్వశీ ఇంకా ఎంత కాలం ఇలా ఐటెం సాంగ్స్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ గా చేయదా? అని చాలా మంది అంటుంటారు.

ఈ ప్రశ్న డైరెక్ట్‌గా ఊర్శశీ రౌటేలాకు కూడా వచ్చింది. దీనికి అదిరిపోయే సమాధానం చెప్పింది ఈ బోల్డ్ బ్యూటీ. ఐటెం సాంగ్స్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, హీరోయిన్ పాత్రలను ఎవరిని ఉద్ధరించడానికి చేయాలి అంటూ సమాధానం ఇచ్చింది. ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి కాకుండా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా హీరోయిన్ గా ఆఫర్లు వచ్చాయట. ఇప్పటికీ వస్తున్నాయట. కానీ, హీరోయిన్ పాత్రలు చేస్తే కెరీర్ డ్యామేజ్ అవుతుందని అన్నింటినీ రిజక్ట్ చేస్తుందట.

“హీరోయిన్ గా చేస్తే చిన్న చిన్న హీరోలు, అంత కంటే చిన్న డైరెక్టర్లతో పని చేయాల్సి ఉంటుంది. పైగా, రెమ్యునరేషన్ తక్కువ. కేటాంచాల్సిన టైం ఎక్కువ. కానీ, ఐటెం సాంగ్స్ చేస్తే… స్టార్ హీరోలు.. టాప్ డైరెక్టర్లు వర్క్ చేస్తాం. ఒక్క రోజులో షూటింగ్ అయిపోతుంది. వెంటనే రెమ్యునరేషన్ వచ్చేస్తోంది. ఇంత కంటే ఎక్కువ ఏం కావాలి” అని ఊర్వశీ రౌటేలా అంటుంది.

- Advertisement -

నిజానికి ఇది కూడా కరెక్టే. ఊర్వశీ కంటే ఇండస్ట్రీలో ముందే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లు.. ప్రస్తుతం ఊర్వశీ కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నారు. కానీ, ఐటెం సాంగ్స్ ను మాత్రమే నమ్ముకున్న ఈ బోల్డ్ బ్యూటీ మాత్రం పాన్ ఇండియా సెలబ్రెటీ అయిపోయింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు