LEO – Bhagavanth Kesari – Tiger Nageswara Rao: ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ గమనించారా?

ఈ ఏడాది దసరా కానుకగా… లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మూడు సినిమాలకు అనుకున్నట్టే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ, ఈ వీకెండ్, తర్వాత వచ్చే పండగ రోజుల్లో బాలయ్య భగవంత్ కేసరి డామినేషన్ ఉంటుందని చెప్పొచ్చు. లియోకి నెగిటివ్ టాక్, టైగర్ నాగేశ్వరరావుకి మిక్స్డ్ టాక్ రావడం భగవంత్ కేసరికి లాంగ్ రన్ లో కలిసొచ్చే అంశం.

అయితే ఈ మూడు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. భగవంత్ కేసరిలో విలన్… తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కన్న కొడుకునే చంపేస్తాడు. అలాగే లియో సినిమాలో దాస్ అండ్ కో కంపెని కోసం సంజయ్ దత్ తన కొడుకు, కూతురిని చంపేయాలని ట్రై చేస్తాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తన హీరో భవిష్యత్తు కోసం తండ్రి, హీరో చేతిలోనే చనిపోతాడు.

అంటే ఈ మూడు సినిమాల్లో తండ్రి – కొడుకుల బాండింగ్ విషయంలో నెగిటివిటీ ఉంది. భగవంత్ కేసరి సినిమాలో విలన్ కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ, లియో, టైగర్ నాగేశ్వరరావులో హీరోకి రిలేటెడ్ గా ఉన్న పాత్రలే నెగిటివ్ గా కనిపించాయి. ఈ పాయింట్ మూడు సినిమాల్లో వర్కట్ అయి.. సినిమాలకు ప్లస్ అయింది. అయితే ఈ మూడు సినిమాల్లో ఇది ఒకటే కామన్ పాయింట్. మిగితా స్టోరీ మొత్తం దేనికి అదే డిఫరెంట్.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు