Anil Ravipudi: మెగాస్టార్ తో మరో కుర్ర డైరెక్టర్.?

శ్రీను వైట్ల దగ్గర కొంతకాలం రచయితగా పనిచేసిన అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో దర్శకుడుగా మారాడు. పటాస్ ఇచ్చిన సక్సెస్ తో వెంటనే మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో “సుప్రీం” సినిమాను చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మాస్ మహారాజా తో అవకాశం అందుకుని “రాజా ది గ్రేట్” తో ఇంకో సక్సెస్ కొట్టాడు.

ఇక్కడ వరకు ఒక ఎత్తు ఇక్కడి నుంచి ఒక ఎత్తు అన్నట్టు 2019లో రిలీజ్ అయిన ఎఫ్2 సినిమాతో వరుణ్ తేజ్ అండ్ వెంకటేష్ ని పెట్టి మల్టీ స్టారర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో అవకాశం చేజెక్కించుకొని “సరిలేరు నీకెవ్వరు” తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా అనిల్ కెరీర్ ని ముందుకు నడిపిస్తూనే వచ్చింది. ఇక రీసెంట్ అనిల్ చేసిన సినిమా “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో అనిల్ బాలకృష్ణని చూపించిన విధానం. శ్రీలీలా ను చూపించిన విధానం. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ డిజైన్ చేసిన విధానం. ఇవన్నీ ఆడియన్స్ కి ఒక మంచి సర్ప్రైజ్ని ఇచ్చాయి.

దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్ గా థియేటర్లో కొనసాగుతుంది. ఇకపోతే రీసెంట్ గా వస్తున్న సమాచారం ప్రకారం అనిల్ తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అది వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చాడు అనిల్. కానీ ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే మెగాస్టార్ చిరంజీవితో ఖచ్చితంగా సినిమా ఉండబోతుంది అన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మించనునట్లు తెలుస్తోంది. అనిల్ కి దిల్ రాజు కి మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అనిల్ చేసిన ఎక్కువ సినిమాలు దిల్ రాజు నిర్మించినయే అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజంగానే వర్కౌట్ అయితే మళ్లీ “వాల్తేరు వీరయ్య” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అనిల్ దర్శకత్వంలో చూడొచ్చు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు