Vivek Atreya: అంటే మరోసారి అదే కాంబినేషన్

వివేక్ ఆత్రేయ…  మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా ఒక మంచి పేరును సాధించుకున్నాడు.  ఆ సినిమా తర్వాత చేసిన “బ్రోచేవారెవరురా” చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నా కూడా వివేక ఆత్రేయది ఒక ప్రత్యేకమైన స్థానమని చెప్పొచ్చు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చివరగా వచ్చిన సినిమా “అంటే సుందరానికి” ఈ సినిమా కమర్షియల్ గా హిట్ సాధించలేదు.
కానీ ఈ సినిమాని వివేక్ ఆత్రేయ డీల్ చేసిన విధానం, నాని పర్ఫామెన్స్ వీటన్నిటికీ ఇప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంటుంది.
ఈ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ వేసి ఉంది. కానీ కమర్షియల్ గా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించలేక పోయింది.

మళ్లీ ఇదే కాంబినేషన్ మరోసారి డీవీవీ దానయ్య బ్యానర్లో రిపీట్ కానుంది.  వీరి కాంబినేషన్ లో వచ్చిన అంటే సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు  అనే ఆలోచనతోనేమో ఈసారి కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చే సబ్జెక్టును వివేక్ ఆత్రేయ ఎంచుకున్నట్టు తెలుస్తుంది.  ఏదేమైనా “అంటే సుందరానికి” కలెక్షన్స్ రాకపోయినా అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి.  ఇప్పటికీ ఆ సినిమాను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు.  ఈసారి అదే కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి చాలామందికి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ సంగీత దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ముహూర్తం ఈనెల 24న జరగనుంది.ఈ సినిమాకి “సరిపోదా శనివారం” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు