Bhagavanth Kesari: బాక్సా ఆఫీస్ వద్ద భగవంత్ కేసరి ప్రభంజనం

“పటాస్” సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పటివరకు 7 సినిమాలు చేశాడు. చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించింది. అయితే అనిల్ చేసిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా మాత్రం ఒక ఎత్తు అని చెప్పొచ్చు.

ఎందుకంటే అనిల్ కెరియర్లో ఇప్పటివరకు ఎక్కువ శాతం కామెడీ సినిమాలనే చేశాడు. అయితే రీసెంట్గా వచ్చిన ఆ భగవంత్ కేసరి సినిమాతో గుడ్ టచ్,బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ను అద్భుతంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ వే లో చెబుతూ ఆడియన్స్ కి మంచి మెసేజ్ ఇచ్చాడు. బాలకృష్ణ లాంటి ఒక స్టార్ హీరోతో అలాంటి ఒక మంచి మెసేజ్ ని చూపించడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి.

దసరా కానుక అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని సాధించి దసరా విన్నర్ గా నిలబడింది.
ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ విషయానికి వస్తే 50 కోట్ల షేర్ మార్క్ ని ఆల్ రెడీ దాటేయగా అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత భగవంత్ కేసరి సినిమా తో హాట్రిక్ 50 కోట్ల షేర్ మార్క్ ని పూర్తి చేసుకున్నాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు