Vijay’s Leo: ఇకనైనా మన ప్రొడ్యూసర్స్ కి అరవ పైత్యం వదులుతుందా..?

వరుస పాన్ ఇండియా హిట్స్ అందుకుంటూ RRR లాంటి సినిమాలతో ఆస్కార్ స్థాయికి ఎదిగింది టాలీవుడ్. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో కనీస గుర్తింపు కూడా దక్కని ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచం తన వైపుకు చూసే స్థాయికి ఎదిగింది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే, మరో వైపు మన నిర్మాతలే మన సినిమాలను చిన్న చూపు చూస్తున్న పరిస్థితి నెలకొంది టాలీవుడ్లో.
పెరుగుతున్న పాన్ ఇండియా కల్చర్ ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనతో తమిళ్ సినిమా రైట్స్ కోసం ఎగబడుతున్నారు మన ప్రొడ్యూసర్స్. బిజినెస్ కోసం ఆలోచించటంలో తప్పు లేదు కానీ, తమిళ సినిమాల రైట్స్ కొన్న ప్రొడ్యూసర్స్ సంక్రాంతి దసరా లాంటి పండగ సీజన్లలో డబ్బింగ్ సినిమాలతో థియేటర్స్ ని కబ్జా చేసి తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారు.
గత సంక్రాంతికి వారసుడు సినిమాతో నిర్మాత దిల్ రాజు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల నాగవంశీ లియో సినిమాతో దసరాకి థియేటర్స్ ని కబ్జా చేసి టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి సినిమాలకు తక్కువ థియేటర్స్ వచ్చేలా చేశాడు.
కట్ చేస్తే, లియో సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది, భగవంత్ కేసరి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, థియేటర్స్ ఎక్కువ సంఖ్యలో కేటాయించటం వల్ల లియో సినిమా వారం తిరిగే సరికి బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. మన సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయంటే స్టార్ హీరోలు సైతం ముంబై, చెన్నై, బెంగళూరు అన్న తేడా లేకుండా ఇండియా మొత్తం తిరిగి ప్రమోషన్స్ లో పాల్గొంటారు, కానీ, విజయ్ మాత్రం ప్రమోషన్స్ కోసం మన తెలుగు స్టేట్స్ లో అడుగు పెట్టిన పాపాన పోలేదు. తమిళ్ లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ విజయ్ సినిమాలకు తెలుగులో మంచి కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ప్రస్తుతం లియో సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాకు తమిళ్ తో పోలిస్తే తెలుగులోనే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇంత ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ పట్ల విజయ్ కి చిన్న చూపు ఉందన్నది వాస్తవం. ఒక్క సినిమాకు కూడా తెలుగు స్టేట్స్ లో ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వకపోవటమే ఇందుకు నిదర్శనం.
లియో సినిమా రిలీజ్ సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ సినిమా రిలీజయ్యాక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరోయిన్ త్రిష కలిసి ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంటారని, హీరో విజయ్ వచ్చే ఛాన్స్ లేదని చెప్పాడు. సినిమా రిలీజయ్యి వారం గడుస్తున్నా కూడా ప్రెస్ మీట్ ప్రస్తావనే లేదు. దీన్ని బట్టి చూస్తే కోలీవుడ్ కి మన ఆడియెన్స్ పట్ల ఎంత చిన్నచూపు ఉందొ తెలుస్తుంది. ఇకనైనా మన నిర్మాతలు అరవ పైత్యం తగ్గించుకుంటే మంచిది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు