Guntur Kaaram Update: ఇది బాబు గారి రీవెంజ్… అందుకే గుంటూరు కారం లేట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యాన్స్‌తో పాట సాధారణ ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ గుంటూరు కారం. 2021లో అనౌన్స్ చేసిన ఈ మూవీ, ఇప్పటికీ కూడా రిలీజ్ కాలేదు. 2024 జనవరి 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్రాంతికి రావడం కూడా కష్టమే. అయితే ఎప్పుడూ సినిమాలను ఫాస్ట్ చేసే త్రివిక్రమ్ గానీ, మహేష్ బాబు గానీ, ఈ సినిమా విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దీనికి కారణం ఎవరు ? అనే ప్రశ్నలు అందరి నుంచి వస్తున్నాయి.

వీటికి కొన్ని సమాధానాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. గుంటూరు కారం మూవీ ఆలస్యమవడానికి, మూడు సార్లు స్క్రిప్స్ మార్చడానికి, కాస్ట్ అండ్ క్రూని ఛేంజ్ అవ్వడానికి కారణం ఒక్కరేనట. ఆయన ఎవరో కాదు.. సూపర్ స్టార్ ట్యాగ్‌తో తెలుగులో టాప్ హీరోగా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు.

ఈ ఆన్సర్ విన్న తర్వాత… తన సినిమాను తానే ఎందుకు ఆలస్యం అయ్యేలా చేస్తాడు? త్వరగా ఫినిష్ చేస్తే.. కొత్త మూవీ చేసుకోవచ్చు కదా.. అంటూ మరి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. వీటి అన్నింటికీ సమాధానం ఉంది.

- Advertisement -

మహేష్ తర్వాత సినిమా రాజమౌళితో ఉంది. అది పట్టాలెక్కడానికి ఇంకా చాలా రోజుల టైం ఉంది. రాజమౌళి సినిమాకి ముందు మరే సినిమా చేయడానికి బాబు గారికి ఇష్టం లేదు. దీంతో ఈ మధ్యలో ఉన్న ఖాళీ టైంని గుంటూరు కారం మూవీకి మాత్రమే కేటాయించాడు.

అలాగే ముఖ్యమైనది ఏంటంటే… గుంటూరు కారం లేట్ అవ్వడానికి మహేష్ బాబు రీవెంజ్ కూడా ఓ కారణమని టాక్. ఎందుకంటే, శ్రీమంతుడు సినిమా టైంలో… మహేష్‌తో సినిమా చేయాలని హారిక & హాసిని క్రియేషన్స్ వాళ్లు ప్రయత్నించారు. మహేష్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. హీరోకి షెడ్యూల్, డేట్స్ సమస్యల వల్ల అప్పుడు సినిమా పట్టాలెక్కలేదు. దీంతో మహేష్ ని అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని హారిక & హాసిని చాలా ఇబ్బంది పెట్టారట. మహేష్ మేనేజర్ అయితే ఈ విషయలో చాలా రోజులు స్ట్రగుల్ అయ్యాడని తెలుస్తుంది.

అప్పటి విషయాన్ని గుర్తుపెట్టుకున్న మహేష్.. ఇప్పుడు గుంటూరు కారం టైంలో రీవెంజ్ తీసుకుంటున్నాడని టాక్. శ్రీమంతుడు టైంలో తనను ఇబ్బంది పెట్టినట్టు… ఇప్పుడు ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే కొంత వరకు షూటింగ్ జరిపిన స్క్రిప్ట్ లను పక్కన పెట్టి, కొత్త స్టోరీ తీసుకోవడం, హీరోయిన్‌ని, యాక్షన్ డైరెక్టర్స్‌ని, కెమెరా మెన్‌ని మార్చాలని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ల పై ఒత్తిడి తెచ్చారట.

అంతే కాదు, అవసరం లేకున్నా… వెకేషన్స్ పేరుతో సినిమా షూటింగ్స్ ను వాయిదా వేసుకుంటూ వచ్చారట బాబు గారు. ఇలా మహేష్ బాబు రీవెంజ్ వల్ల గుంటూరు కారం మూవీ షూటింగ్, రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుందని గుస గుస. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం… గుంటూరు కారం వచ్చే సంక్రాంతికి కూడా కష్టమే…

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు