Guntur Kaaram: మహేష్ ఫారిన్ ట్రిప్స్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి రిలీజ్ డిలే అయ్యింది. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే రీస్టార్ట్ చేసి శరవేగంగా షూట్ చేస్తున్నారు మేకర్స్.

ఆ మధ్య షూటింగ్ కి బ్రేక్ పడిన సమయంలో మహేష్ ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లటంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఈ అంశంపై పలు సందర్భాల్లో నిర్మాత నాగవంశీని మీడియా ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చాడు. షూటింగ్ స్టార్ట్ కాకముందే మహేష్ ఫారిన్ ట్రిప్స్ గురించి తమకు తెలుసని, ఆయన ట్రిప్స్ ని బట్టి షూటింగ్ షెడ్యూల్ చేస్తామని చెప్పాడు.

షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని మహేష్ ట్రిప్స్ ప్లాన్ చేయటం, మహేష్ ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తే షూటింగ్ క్యాన్సిల్ చేయటం జరగలేదని క్లారిటీ ఇచ్చాడు. సమ్మర్ సీజన్లో, బర్త్ డేస్ టైమ్ లో మహేష్ ఫారిన్ వెళ్ళటం ప్రతి సారి జరిగేదే అని అన్నాడు నాగవంశీ. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు