Tiger nageshwararao: మాస్ రాజా అక్కడ బాగానే ఫోకస్ చేస్తున్నాడు..!

Tiger nageshwararao:

టాలీవుడ్ లో ఈ దసరా కి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “టైగర్ నాగేశ్వరరావు” ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రూపొందడం వల్ల ఇతర భాషలకు చెందిన నటులు కూడా నటించడం జరిగింది. ఇక రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా యొక్క ప్రమోషన్లలో భాగంగా లేటెస్ట్ గా ముంబై వెళ్ళాడు రవితేజ. అయితే కేవలం మూడు రోజుల కిందటే ముంబై వెళ్లిన రవన్న ఇప్పుడు మళ్ళీ హిందీ ప్రమోషన్లకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎందుకంటే గతంలోనూ కొన్ని సినిమాలు హిందీలో రిలీజ్ చేసినప్పటికీ ఇంత ఫోకస్ ఎప్పుడూ చేయలేదు. మరి మారిన కాలానుగుణంగా అందరు స్టార్ హీరోలలాగే హిందీలో మార్కెట్ పెంచుకుందామని ట్రై చేస్తున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా రవితేజ మీడియా వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి పూర్తిగా హిందీలో మాట్లాడడం జరిగింది. ఇక ముంబై నుండి రాగానే బెంగుళూరు కి ప్రమోషన్స్ చేయడానికి వెళ్తున్నాడని సమాచారం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు