Raviteja: ‘టైగర్ నాగేశ్వర రావు’ అరుదైన రికార్డు.. ఇండియన్ సినిమాల్లో ఫస్ట్ ఇదే.!

Raviteja:

టాలీవుడ్ లో ఈ దసరా కి రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో “టైగర్ నాగేశ్వర రావు” కూడా ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించగా, మురళి శర్మ, జిష్షు సేన్ గుప్త, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో రవితేజ 70స్ ల కాలానికి చెందిన పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు గా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మరో భాషలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియచేసారు. అదే “సైన్ లాంగ్వేజ్”. ఇదేదో అర్ధం కానీ భాష అని కొందరు అనుకోవచ్చు. కానీ అదేం కాదు. సైన్ లాంగ్వేజ్ అంటే దేశంలో కేవలం సైగలతో మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి వాడే బాష ఇది.

అంటే కొందరు దివ్యంగులైన చెవిటి, మూగ కలవారిని కమ్యూనికేట్ చేసే భాష ఇది. ఈ లోపంతో ఉన్న వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే వీరికి కూడా అర్ధమయ్యేలా సైన్ లాంగ్వేజ్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సైన్ లాంగ్వేజ్ లో కూడా ట్రైలర్ రిలీజ్ చేయగా, దానికి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్న ఫస్ట్ కమర్షియల్ మూవీ ఇదే కావడం విశేషం. గతంలో కొన్ని డాక్యుమెంటరీ మూవీస్ ని కొందరికోసం ప్రదర్శించేవారు. కానీ కమర్షియల్ సినిమాలెప్పుడూ రాలేదు. ఈ అరుదైన రికార్డు తో “టైగర్ నాగేశ్వర రావు” పై హైప్ తో పాటు మరింత పాజిటివిటీ పెరిగిందని చెప్పొచ్చు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు