Siva Karthikeyan: అయలాన్ టీజర్… ‘ఏలియన్’ తో సావాసం.. పాత కథే.. కానీ కొత్తగా..!

Siva Karthikeyan:

కోలీవుడ్ న్యాచురల్ స్టార్ శివ కార్తికేయన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అందరి హీరోల్లా మాస్ జోనర్ లోకి పోకుండా తనకి అచొచ్చిన కామెడీ జోనర్లోనే డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. రీసెంట్ గా ‘మహా వీరుడు’ అంటూ కామెడీ జోనర్ లో ఓ సినిమాతో వచ్చి మంచి సక్సెస్ కొట్టగా, ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆ సినిమా పేరు “అయలాన్”. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో పోస్టర్స్ ద్వారానే మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా అయలాన్ యొక్క అఫిషియల్ టీజర్ కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా ఒక ఏలియన్ తో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇంతకు ముందే పోస్టర్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఇక టీజర్ లో కూడా అలాగే చూపించారు మేకర్స్. ఇండియా లో అనుకోకుండా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏలియన్ భూమి మీదకి వస్తుంది.

ఆ ఏలియన్ కొన్ని ప్రమాదాల్ని ఎదుర్కున్న తర్వాత హీరోకి దగ్గరయ్యి స్నేహం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అయలాన్ సినిమా చూసి తెలుసుకోవాలి. టీజర్ చూసాక ఒక్క మాటలో చెప్పాలంటే… పాత కథే కానీ ఫ్రెష్ గా శివ కార్తికేయన్ స్టైల్ లో చూపిస్తారని అనిపిస్తుంది. గతంలో ఇదే కాన్సెప్ట్ తో హిందీలో వచ్చిన “కోయి మిల్ గయా”, క్రిష్ వంటి సినిమాలని మనం చూసాం. ఆ సినిమాలు చూసిన వాళ్ళకి ఈ టీజర్ చూస్తే ఖచ్చితంగా కొన్ని సీన్లు గుర్తుకువస్తాయి.

- Advertisement -

ఇక అయలాన్ సినిమాకి మేకర్స్ చాలా ఖర్చు పెట్టారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఏలియన్ డిజైన్ ఇంకొంచెం రియాల్సిటిక్ గా ఉంటే బాగుండేదనిపించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తర్వాత తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమాతో కనిపించబోతుంది. ఓవరాల్ గా టీజర్ మంచి రెస్పాన్స్ తో హైప్ పెంచుకుంది. ఈ సినిమాలో శరత్ కేల్హర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరణ్, డేవిడ్ బ్రౌటన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘అయలాన్’ చిత్రం 2024 పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు