Shiva karthikeyan: తెలుగు డైరెక్టర్‌తో మరోసారి ధైర్యం చేస్తున్నాడా?

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్ జోరుమీదున్నాడు. గత ఏడాది ప్రిన్స్ సినిమా తో పలకరించిన శివ కార్తికేయన్, ప్రస్తుతం అయలాన్, మావీరన్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్న శివ కార్తికేయన్ వరుస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్నాడు.

లాస్ట్ ఇయర్ తెలుగు డైరెక్టర్ అయిన “జాతిరత్నాలు” ఫేమ్ అనుదీప్ తో ప్రిన్స్ అనే సినిమా చేసాడు. 2022 అక్టోబర్ లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్లాప్ అయింది. అయితే ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ తో సినిమా కన్ ఫర్మ్  చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రాధేశ్యామ్ సినిమా డైరెక్టర్ అయిన రాధాకృష్ణ తో శివ కార్తికేయన్ సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ, రెండో సినిమాతోనే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా  యాక్టర్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయితే రాధా కృష్ణ లేటెస్ట్ గా శివ కార్తికేయన్ కు కథ వినిపించినట్లు, ఆ స్టోరీ కూడా ఫిక్స్ అయినట్టు గాసిప్స్ వస్తున్నాయి.

- Advertisement -

అయితే తెలుగు డైరెక్టర్ అనుదీప్ తో ప్రిన్స్ సినిమా చేసి సినిమా ప్లాప్ అందుకున్న శివ కార్తికేయన్, మరో తెలుగు డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు