Samantha: ఎక్కడికి వెళ్ళినా తెల్ల బట్టలే ఎందుకు ధరిస్తుందో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోలు లేకుండా సినిమాని తన భుజాలపై మోయగల సత్తా ఉన్న లేడీ సమంత అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలిచూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హోదాకు చేరుకుంది.

ఇన్నేళ్లలో సమంత తన సినిమాలకి ప్రత్యేక మార్కెట్ ని ఏర్పరుచుకోవడమే కాకుండా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ తో దూసుకుపోతుంది సమంత. ‘యశోద’ లాంటి సూపర్ హిట్ తరువాత సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ అనే ఓ పౌరాణికంలో నటించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ ను పోషిస్తుంది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అయితే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటుంది సమంత. అయితే ఈ మధ్యకాలంలో సమంత బయట ఎక్కడ కనిపించినా తెల్లటి దుస్తులలోనే కనిపిస్తూ ఉండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఫోటోషూట్స్ కోసం పలు మోడరన్ దుస్తులను ధరించే సమంత.. పర్సనల్ పనిమీద ఎక్కడికి వెళ్ళినా సరే తెల్లటి దుస్తులను ప్రిఫర్ చేస్తోంది. మొన్నటికి మొన్న పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు కూడా ట్రెడిషనల్ తెల్ల దుస్తులలోనే కనిపించింది.

- Advertisement -

అంతేకాదు బయట ఈవెంట్స్ లో ఎక్కడ కనిపించినా కూడా తెల్లటి చీరలలో లేదా తెల్లటి చుడీదార్ లోనే కనిపిస్తుంది. అయితే సమంత ఎందుకు ఈ తెల్లటి వస్త్రాలని ధరిస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ ప్రశ్న తలెత్తడంతో నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సమంత తన చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రశాంతంగా ఉంచేలా చూసుకుంటుందని, శాంతి వైపుగా అడుగులు వేయాలనుకుంటుందని, కొత్త జీవితం వైపు అడుగులు వేస్తూ ఆమె పూర్తిగా మారిపోయిందని చెప్పడానికే ఇలాంటి దుస్తులు ధరిస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు